శరీరంలో వాపులు తగ్గాలంటే ఈ ఆహారాలను తీసుకోవాలి..!

మన శరీరం గాయాల బారిన పడినప్పుడు లేదా ఇన్‌ఫెక్షన్లకు గురైనప్పుడు మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ అప్రమత్తమై ఆయా భాగాల్లో వాపులను కలగజేస్తుంది. ఇది సహజసిద్ధమైన ప్రక్రియే. అయితే కొందరికి ఇలా వచ్చే వాపులు తగ్గవు. అలాగే ఉంటాయి. దీంతో అవి దీర్ఘకాలికంగా ఉంటే ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. కనుక వాపులు దీర్ఘకాలంగా ఉంటే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకు గాను పలు ఆహారాలు ఉపయోగపడతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరంలో వాపులు తగ్గాలంటే ఈ ఆహారాలను తీసుకోవాలి..!

1. పాలకూర వంటి ఆకుపచ్చని ఆకుకూరలతోపాటు ఆకుపచ్చని కూరగాయల్లో అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. కనుక వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి.

2. బ్లాక్‌ బెర్రీలు, బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్‌బెర్రీలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వాపులను తగ్గించుకోవచ్చు.

3. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల చేపలను వారంలో కనీసం రెండు సార్లు తింటే ఫలితం ఉంటుంది.

4. అవకాడోల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు, విటమిన్‌ కె ఉంటాయి. ఇవి వాపులను తగ్గించడంలో సహాయ పడతాయి.

5. బాదంపప్పు, పిస్తా, జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. అందువల్ల వాపులను తగ్గిస్తాయి.

6. ఆలివ్‌ ఆయిల్‌లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వాపుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

ఇవే కాకుండా డార్క్‌ చాకొలెట్‌, పసుపు, అల్లం, చిలగడ దుంపలు, యాపిల్స్‌, చెర్రీలు, బీన్స్‌, అవిసె గింజలు, టమాటాలు, పుట్ట గొడుగులు, గ్రీన్‌ టీ, క్యారెట్లు వంటి ఆహారాల్లోనూ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటిని తింటుంటే వాపులు తగ్గుతాయి.

Admin

Recent Posts