Fat Reducing Drink : రోజుకు 3 సార్లు దీన్ని తాగితే చాలు.. పొట్ట, నడుము, తొడల దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది.. అధిక బరువు… ఈ సమస్య బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. మనం తీసుకునే ఆహారం నుండి మనం చేసే పని కూడా అధిక బరువు దారి తీస్తుందని తెలిసినా కూడా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. అధిక బరువు సమస్య నుండి బయటపడడానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి ఫలితం లేక నిరాశ చెందిన వారు ఈ చిట్కాను నెల రోజుల పాటు పాటించడం వల్ల అధిక బరువును వేగంగా తగ్గవచ్చు. అంతేకాకుండా ఈ చిట్కాను పాటించడం వల్ల పొట్ట, తొడలు, పిరుదులు వంటి భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది.
మన వంటింట్లో ఉండే పదార్థాలను ఉపయోగించి మనం అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. శరీరంలో కొవ్వును కరిగించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో రెండు బిర్యానీ ఆకులను, 2 కచ్చాపచ్చాగా దంచిన యాలకులను , ఒక ఇంచు దాల్చిన ముక్కను, ఒక టీ స్పూన్ జీలకర్రను వేయాలి. తరువాత ఈ నీటిని బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని పూటకు ఒక గ్లాస్ చొప్పున మూడు పూటలా తీసుకోవాలి. ఉదయాన్నే ఎక్కువ మోతాదులో ఈ పానీయాన్ని తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు.
అలాగే ఈ పానీయాన్ని తాగే ప్రతిసారీ గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఉదయం పరగడుపున, మధ్యాహ్నం భోజనం చేసిన అరగంట తరువాత, రాత్రి భోజనం చేసిన అరగంట తరువాత ఈ పానీయాన్ని తీసుకోవాలి. ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా నెలరోజుల పాటు తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా పొట్ట, తొడలు వంటి భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగి సన్నగా, నాజుకుగా తయారవుతారు. బరువు తగ్గడంతో పాటు ఈ పానీయాన్ని తాగడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. జీర్ణసంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. రాత్రిపూట ఈ పానీయాన్ని తాగడం వల్ల నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది. ఈ పానీయాన్ని రోజూ మూడు పూటలా నెలరోజుల పాటు తీసుకోవడం వల్ల శరీరభాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగి సులభంగా బరువు తగ్గవచ్చు.