Honey And Cinnamon : అధిక బరువు తగ్గేందుకు ప్రస్తుతం చాలా మంది అనేక రకాలుగా యత్నిస్తున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా అధికంగా ఉన్న బరువును తగ్గించుకోలేకపోతున్నారు. వ్యాయామం, యోగా చేయడం, డైట్ పాటించడం చేస్తున్నా బరువు తగ్గడం లేదని వాపోతున్నారు. అయితే అలాంటి వారు కింద తెలిపిన ఓ చిట్కాను ఉపయోగించి అధిక బరువును ఇట్టే తగ్గించుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది. సన్నగా నాజూగ్గా మారుతారు. పొట్ట చుట్టూ, తొడల దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది. శరీరం చక్కని ఆకృతిని పొందుతుంది. అయితే ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువును తగ్గించడంలో తేనె, దాల్చిన చెక్క మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలంటే.. రెండు కప్పుల నీళ్లను తీసుకుని బాగా మరిగించాలి. నీరు బాగా మరుగుతున్నప్పుడు అందులో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి వేయాలి. మళ్లీ 2 నిమిషాల పాటు నీళ్లను బాగా మరిగించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లరానివ్వాలి. గోరు వెచ్చగా అయ్యాక అందులో 2 టీస్పూన్ల తేనె కలిపి తాగేయాలి. ఇలా మిశ్రమాన్ని తయారు చేసి తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
పైన తెలిపిన విధంగా మిశ్రమాన్ని తయారు చేసి తాగడం వల్ల శరీరంలో అధికంగా ఉండే కొవ్వు మొత్తం కరుగుతుంది. కాకపోతే ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున, రాత్రి నిద్రించే ముందు.. మొత్తం రెండు సార్లు తాగాలి. అప్పుడే ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమంలో ఉండే తేనె బరువును తగ్గించడంలో, కొవ్వును కరిగించడంలో సహాయ పడుతుంది. ఇక దాల్చిన చెక్క కొవ్వును కరిగిస్తుంది. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. ఇలా ఈ మిశ్రమం వల్ల కేవలం బరువు తగ్గడమే కాకుండా.. ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు.