Kidneys Clean : మనం తినడం ఎంత ముఖ్యమో మనం తిన్న ఆహారంలోని వ్యర్థాలను అలాగే మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపండం కూడా అంతే ముఖ్యం. మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో మూత్రపిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మన శరీరంలోని వ్యర్థాలను మూత్రపిండాలు బయటకు పంపకపోతే మనం ఒక్కరోజు కూడా బ్రతకలేం. శరీరం సక్రమంగా పని చేయాలంటే మూత్రపిండాలు నిరంతరంగా పని చేయాలి. నిత్యం ఎన్నో రకాల లవణాలను, వ్యర్థాలను వడపోసి మూత్రపిండాలు బయటకు పంపిస్తూ ఉంటాయి. మన ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర పోషించే మూత్రపిండాలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాల కారణంగా మూత్రపిండాలు పాడయ్యే అవకాశం ఉంది.
కనుక మనం మూత్రపిండాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇంటి చిట్కాను ఉపయోగించి మనం చాలా సులభంగా మూత్రపిండాలను శుభ్రం చేసుకోవచ్చు. ఈ చిట్కాను పాటించడం వల్ల మూత్రపిండాల్లో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు, మలినాలు తొలిగిపోతాయి. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ముఖ్యంగా కావల్సింది కొత్తిమీర. దీనిని మనం ఎక్కువగా వంటలల్లో వాడుతూ ఉంటాం. కొత్తిమీరను వాడడం వల్ల మనం చేసే వంటల రుచి, వాసన పెరుగుతుందని చెప్పవచ్చు. కొత్తిమీరతో కొత్తిమీర రైస్, కొత్తిమీర పచ్చడి వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు వంటల్లో కొత్తిమీర వేసిన వేయకపోయిన కూడా ఏం కాదులే అని భావించి పక్కకు పడేస్తూ ఉంటాం.
కానీ కొత్తిమీర రుచికి, సువాసనకు మాత్రమే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కొత్తిమీరలో అనేక రకాల పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థ పనితీరును, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మజ్జిగలో ఒక టీ స్పూన్ కొత్తిమీర రసం, చిటికెడు జీలకర్ర కలిపి రాత్రిపూట తీసుకున్నట్టయితే శరీరానికి కావల్సిన విటమిన్స్ అన్నీ లభిస్తాయి. ఎముకలు ధృఢంగా ఉంటాయి. పేగు పూత, కడుపులో మంట వంటి సమస్యలతో బాధపడే వారు పెరుగులో కొత్తిమీరను కలిపి తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. చిగుళ్ల సమస్యలు ఉన్న వారు, నోటిదుర్వాసనతో బాధపడే వారు కొత్తిమీర ఆకులను నమిలి మింగితే ఆయా సమస్యలు తగ్గు ముఖం పడతాయి.
ఈ కొత్తిమీర ఆకులతో మూత్రపిండాలను శుభ్రపరిచే చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కొత్తిమీరను బాగా కడగాలి. తరువాత వాటిని ముక్కలుగా చేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీటిని పోసి అందులో కొత్తిమీరను వేసి నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత అదే గిన్నెను స్టవ్ మీద ఉంచి 10 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత దీనిపై మూతను ఉంచి నీటిని చల్లారనివ్వాలి. నీరు చల్లారిన తరువాత వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కొత్తిమీర నీటిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ కూడా చేసుకోవచ్చు. వారానికి ఒకసారి ఒక గ్లాస్ మోతాదులో ఈ కొత్తిమీర నీటిని తాగడం వల్ల మూత్రపిండాలు శుభ్రపడతాయి.
ఈ నీటిని తాగడం వల్ల స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక గర్భిణీ స్త్రీలు రోజూ 2 టీ స్పూన్ల కొత్తిమీర రసాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే కడుపులో తిప్పడం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. మూత్రపిండాలను శుబ్రపరుచుకోవడానికి ఈ కొత్తిమీర ఎంతగానో సహాయపడతాయి. మూత్రపిండాల పనితీరుపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కనుక ఈ కొత్తిమీర నీటిని వారానికి తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.