రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలతోపాటు పాటించే అలవాట్ల వల్ల మన శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. మనం తినే ఆహారాల్లో ఉండే విష పదార్థాలు కూడా మన శరీరంలో చేరుతుంటాయి. అయితే వాటిని ఎప్పటికప్పుడు బయటకు పంపాలి. లేదంటే వ్యాధులు వస్తాయి. ఈ క్రమంలోనే కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకుంటే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపవచ్చు. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. మరి రోజూ తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి అనంతరం వచ్చే నీటిని తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది.
ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో చిన్న అల్లం ముక్క వేసి నీటిని బాగా మరిగించాలి. అనంతరం వచ్చే నీటిలో నిమ్మరసం కలిపి తాగాలి. దీని వల్ల కూడా వ్యర్థాలను బయటకు పంపవచ్చు.
రోజూ రాత్రి ఒక గ్లాస్ నీటిలో గుప్పెడు మెంతులను నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే ఆ నీటిని తాగాలి. దీంతో శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి.
నీటిలో కొద్దిగా పసుపు వేసి మరిగించి వచ్చే నీటిని తాగుతుంటే శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. వ్యర్థాలు బయటకు పోతాయి. పరగడుపునే ఇలా చేయాల్సి ఉంటుంది.