డ్రింక్స్‌

తుల‌సి ఆకుల‌తో త‌యారు చేసే క‌షాయం.. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది..!

ఓ వైపు క‌రోనా సమ‌యం.. మ‌రోవైపు సీజ‌న్ మారింది.. దీంతో మ‌న శ‌రీరంపై దాడి చేసేందుకు సూక్ష్మ క్రిములు సిద్ధ‌మ‌వుతున్నాయి. వాటి వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. సీజ‌న్ మారిన‌ప్పుడు స‌హ‌జంగానే ద‌గ్గు, జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం వ‌స్తాయి. కానీ కోవిడ్ స‌మయం క‌నుక ఇంకా జాగ్ర‌త్త‌గా ఉండాలి. అందుకు గాను రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే క‌షాయాల‌ను తాగాలి. అలాంటి ఓ క‌షాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

tulsi kashayam for immunity

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే క‌షాయం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు

  • నీళ్లు – 4 గ్లాసులు
  • ప‌సుపు – పావు టీస్పూన్
  • దాల్చిన చెక్క – 1 ఇంచు ముక్క
  • తుల‌సి ఆకులు – 4 లేదా 5
  • మిరియాలు – 4 లేదా 5
  • ల‌వంగాలు – 2
  • వాము – అర టీస్పూన్
  • యాల‌కులు – 3

క‌షాయం త‌యారు చేసే విధానం

ఒక పాత్ర తీసుకుని అందులో ముందుగా నీటిని పోసి మ‌రిగించాలి. త‌రువాత అన్ని ప‌దార్థాల‌ను వేయాలి. మ‌ళ్లీ 10-15 నిమిషాల పాటు మ‌రిగించాలి. నీళ్లు స‌గం అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి.

ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. రోగాల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. దీన్ని రోజుకు ఒక‌సారి తాగ‌వ‌చ్చు.

అయితే తుల‌సి ఆకుల‌కు బ‌దులుగా అల్లం లేదా అతి మ‌ధురం చూర్ణం వాడ‌వ‌చ్చు. దీంతో క‌షాయం రుచి మారుతుంది. కానీ ప్ర‌యోజ‌నాలు మాత్రం అవే క‌లుగుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts