Chicken Soup : చికెన్ సూప్‌ను ఇలా సుల‌భంగా త‌యారు చేయండి.. చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైంది..!

Chicken Soup : మాంసాహార ప్రియుల‌కు నాన్ వెజ్ పేరు చెప్ప‌గానే ముందుగా గుర్తుకు వ‌చ్చేది చికెన్‌. చాలా మంది మ‌ట‌న్‌, చేప‌ల క‌న్నా చికెన్‌నే ఎక్కువ‌గా తింటుంటారు. చికెన్‌లో ఇత‌ర మాంసాహారాల క‌న్నా కొవ్వు శాతం త‌క్కువ‌గా.. ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే త్వ‌ర‌గా ఉడుకుతుంది. తేలిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. క‌నుక నాన్ వెజ్ ల‌వ‌ర్స్ ఫ‌స్ట్ చాయిస్.. చికెన్ అని చెప్ప‌వ‌చ్చు. అయితే చికెన్‌తో ఎప్పుడూ ఒకేర‌క‌మైన వంట‌కాలు కాకుండా భిన్న ర‌కాలుగా వంట‌లు చేసుకుని తినాల‌ని అనుకునేవారు దాంతో సూప్ త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. ఇది చేయ‌డం చాలా సుల‌భమే. పైగా ఎంతో రుచిగా ఉంటుంది. పోష‌కాలు, శ‌క్తి రెండూ ల‌భిస్తాయి. ఇక చికెన్ సూప్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

make Chicken Soup in this way very easy to cook
Chicken Soup

చికెన్ సూప్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోన్‌లెస్ చికెన్ – పావు కిలో, పాల‌కూర త‌రుగు – ఒక క‌ప్పు, క్యారెట్ త‌రుగు – పావు క‌ప్పు, బీన్స్ త‌రుగు – పావు క‌ప్పు, వెల్లుల్లి త‌రుగు – ఒక టీస్పూన్‌, ప‌చ్చి మిర్చి త‌రుగు – ఒక టీస్పూన్‌, కార్న్ ఫ్లోర్ – ఒక టీస్పూన్‌, నూనె – ఒక టీస్పూన్‌, ఉప్పు – త‌గినంత‌, చక్కెర – ఒక టీస్పూన్‌, మిరియాల పొడి – చిటికెడు, టేస్టింగ్ సాల్ట్ – చిటికెడు, ఉల్లికాడ‌ల త‌రుగు – 2 టీస్పూన్లు.

చికెన్ సూప్ త‌యారు చేసే విధానం..

ముందుగా ఒక పాత్ర‌లో చికెన్ మునిగేలా నీళ్లు పోసి ఉడికించి ప‌క్క‌న పెట్టుకోవాలి. స్ట‌వ్ మీద పాన్ పెట్టి నూనె వేసి కాగిన త‌రువాత క్యార‌ట్‌, బీన్స్‌, వెల్లుల్లి, ప‌చ్చి మిర్చి త‌రుగుల‌ను వేసి కొద్దిగా వేయించాలి. చికెన్ ఉడికించిన నీళ్లు, చ‌క్కెర‌, ఉప్పు, పాల‌కూర త‌రుగు, మిరియాల పొడి, టేస్టింగ్ సాల్ట్ వ‌రుస‌గా ఒక‌దాని త‌రువాత ఒక‌టి వేసి కొద్దిసేపు ఉడికించి దింపేయాలి. వెడ‌ల్పాటి బౌల్‌లో వేసి కొత్తిమీర త‌రుగుతో అలంక‌రించి.. వేడి వేడిగా స‌ర్వ్ చేయాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే చికెన్ సూప్ తాగేందుకు రెడీ. ఇది ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైంది. త‌ర‌చూ తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

Editor

Recent Posts