Aloo Pulao : నోరూరించే వేడి వేడి ఆలు పులావ్‌.. ఇలా తయారు చేసుకోండి..!

Aloo Pulao : ఆలుగడ్డలతో చేసే ఏ వంటకం అయినా సరే చాలా మందికి నచ్చుతుంది. ఈ క్రమంలోనే చాలా మంది వీటితో ఫ్రై ఎక్కువగా చేసుకుని తింటుంటారు. కొందరు ఆలు చిప్స్‌ అంటే ఎక్కువగా తింటారు. ఇక కొందరు వీటిని టమాటాలతో కలిపి తింటారు. అయితే ఆలుగడ్డలతో పులావ్‌ కూడా చేసుకుని తినవచ్చు. అది ఎంతో రుచికరంగా ఉంటుంది. మరి వేడి వేడి ఆలు పులావ్‌ని ఎలా తయారు చేయాలో.. దాని తయారీకి ఏమేం పదార్థాలు కావాలో.. ఇప్పుడు తెలుసుకుందామా..!

mouth watering delicious Aloo Pulao know the recipe

ఆలు పులావ్‌ తయారీకి కావల్సిన పదార్థాలు

* బాస్మతి బియ్యం – ఒకటిన్నర కప్పు (నానబెట్టుకోవాలి)

* బేబీ ఆలూ – 10

* ఉల్లిపాయ – ఒకటి

* అల్లం వెల్లుల్లి ముద్ద – రెండు టేబుల్‌ స్పూన్లు

* పెరుగు – అర కప్పు

* కారం – ఒక చెంచా

* ధనియాల పొడి – రెండు చెంచాలు

* గరం మసాలా – చెంచా

* పుదీనా తరుగు – పావు కప్పు

* కొత్తిమీర తరుగు – పావు కప్పు

* పచ్చి మిర్చి – రెండు

* అనాస పువ్వు – ఒకటి

* బిర్యానీ ఆకు – ఒకటి

* లవంగాలు – నాలుగు

* యాలకులు – రెండు

* దాల్చిన చెక్క – ఒకటి

* నిమ్మరసం – టేబుల్‌ స్పూన్‌

* నెయ్యి – మూడు టేబుల్‌ స్పూన్లు

* ఉప్పు – తగినంత

తయారీ విధానం

ముందుగా బంగాళాదుంపల చెక్కు తీసి నీటిలో వేసి పెట్టుకోవాలి. అదేవిధంగా పెరుగులో కారం, ధనియాల పొడి, గరంమసాలా వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్‌ మీద బాణలి పెట్టి ఒకటిన్నర టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేయాలి. అది వేడెక్కాక బంగాళాదుంపల్ని వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేసి అనాస పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి వేయించి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి ఎర్రగా వేగాక అల్లం వెల్లల్లి ముద్ద వేయించి నిలువుగా తరిగిన పచ్చి మిర్చి వేసి పెరుగు, కొత్తమిర, పుదీనా తరుగు వేసి అన్నింటినీ కలపాలి. రెండు నిమిషాలయ్యాక బియ్యం, వేయించిన ఆలు, రెండున్నర కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి మూత పెట్టాలి. అన్నం పూర్తిగా ఉడికాక దింపేయాలి. దీంతో వేడి వేడి ఆలు పులావ్‌ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా తినేయవచ్చు. పెరుగు రైతా, కూరలతో తినవచ్చు. భలే రుచిగా ఉంటుంది.

Admin

Recent Posts