Mosquito Problem : మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో వేప చెట్లు ఎక్కువగా పెరుగుతుంటాయి. పూర్వ కాలం నుంచి వేప చెట్టుకు చెందిన అన్ని భాగాలను పలు వ్యాధులను, అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు చికిత్సలో ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇక ఆయుర్వేదంలోనూ వేపను ప్రధానంగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, బెరడును పలు ఔషధాల తయారీలో వాడుతారు.
అయితే వేప ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అవి క్రిమి కీటకాలను తరిమివేస్తాయి. అందుకనే అమ్మవారు వంటి వ్యాధులు వచ్చినప్పుడు వేపాకులను పేస్ట్‌లా చేసి శరీరానికి రాసి స్నానం చేయిస్తారు. దీంతో ఆ వ్యాధి తగ్గిపోతుంది. ఇలా ఎన్నో వైరస్, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లతోపాటు చర్మ సమస్యల నుంచి కూడా మనల్ని వేపాకులు రక్షిస్తాయి. అందుకని వేపాకులతో ఆయా సమస్యలను తగ్గించుకోవచ్చు.
ఇక ప్రస్తుతం సీజన్లతో సంబంధం లేకుండా మనల్ని దోమలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మీ ఇంట్లో కూడా దోమలు బాగా ఉన్నట్లయితే.. వేపాకులతో వాటిని తరిమేయవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
వేపాకులను లేదా కొమ్మలను సేకరించి నీడలో ఎండబెట్టాలి. అనంతరం వాటికి మంట పెట్టి ధూపంలా ఇంట్లో పొగ వేయాలి. ఇంట్లోని అన్ని గదుల్లోనూ పొగతో ధూపం వేయాలి. ఇలా తరచూ చేస్తుంటే దోమలు అస్సలు ఉండవు. ఇంట్లోకి దోమలు రావు. దీంతో దోమల బెడద తగ్గిపోతుంది.
ఇక వేపాకులతో షుగర్‌ను తగ్గించుకోవచ్చు. చర్మ సమస్యలు కూడా తగ్గిపోతాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపునే 4, 5 వేపాకులను నమిలి తింటుండాలి. అలాగే వేపాకుల రసాన్ని స్నానం చేసే నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి. దీంతో చర్మ సమస్యలు తగ్గుతాయి. ఇలా వేపాకులు అనేక సమస్యలకు ఉపయోగపడతాయి.