Ashwagandha For Nerves : దీన్ని తింటే చాలు.. న‌రాల బ‌ల‌హీన‌త పోతుంది.. ఎంతో బ‌లం వ‌స్తుంది..

Ashwagandha For Nerves : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. పెద్ద వారిలోనే కాకుండా న‌డివయ‌స్కుల వారిలో కూడా మ‌నం ఈ స‌మ‌స్య‌ను చూడ‌వ‌చ్చు. మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలే ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. దీర్ఘ కాలిక త‌ల‌నొప్పి, కండ‌రాలు బ‌లం కోల్పోవ‌డం, ఏప‌ని చేయ‌లేక‌పోవ‌డం, స్ప‌ర్శ కోల్పోవ‌డం, జ్ఞాప‌క శ‌క్తి మందగించ‌డం, తిమ్మిర్లు, కాళ్లు , చేతులు ఎత్త‌లేక‌పోవ‌డం వంటి వాటిని నరాల బ‌ల‌హీన‌త ల‌క్ష‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. ఒత్తిడి, న‌రాల్లో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా లేక‌పోవ‌డం వంటి వివిధ‌ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఎంత‌గానో వేధించే ఈ న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య‌ను మ‌నం ఆయుర్వేద చిట్కాల ద్వారా కూడా న‌యం చేసుకోవ‌చ్చు. న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఈ చిట్కాల‌ను వాడ‌డం చాలా తేలిక‌. న‌రాల బ‌ల‌హీన‌త‌ స‌మ‌స్య‌తో బాధ‌పడే వారు అశ్వ గంధ పొడిని, అతి మ‌ధురం పొడిని స‌మ‌పాళ్ల‌ల్లో తీసుకుని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ల్లో క‌లిపి తాగాలి. రోజుకు రెండు పూట‌లా రెండు నెల‌ల పాటు తాగ‌డం వ‌ల్ల న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే వేలు మందం ఉన్న అతిబ‌ల చెట్టు క‌ట్ట‌ల‌ను ఆరింటిని తీసుకుని రాగి తీగ‌తో చుట్టాలి. త‌రువాత గిన్నెలో పాలు పోసి ఈ క‌ట్టెల‌తో క‌లుపుతూ మ‌రిగించాలి. ఇలా మ‌రిగించ‌డం వ‌ల్ల పాలు గట్టిగా ముద్ద‌లా త‌యార‌వుతాయి. ఈ ముద్ద‌ను ఆర‌బెడితే పొడి త‌యార‌వుతుంది. ఈ పొడిలో చ‌క్కెర క‌లుపుకుని తిన‌డం వ‌ల్ల న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య త‌గ్గ‌డంతో పాటు అమిత‌మైన బ‌లం క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Ashwagandha For Nerves works effectively know how to take
Ashwagandha For Nerves

ఈ చిట్కాల‌ను చిన్న పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని వారు తెలియ‌జేస్తున్నారు. అలాగే ఈ ఆయుర్వేద చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాల బారిన ప‌డ‌కుండా ఉంటాము. వీటితో పాటు అవిసె గింజ‌లు, చేప‌లు, ఆక్రోట్, కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు, పండ్లు వంటి ఎక్కువ‌గా తీసుకోవాలి. తీపి ప‌దార్థాల‌కు, జంక్ ఫుడ్ కు, ప్రాసెస్డ్ ఫుడ్, వేయించిన ఆహార ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి. అలాగే ఒత్తిడి త‌గ్గ‌డానికి , ఆందోళ‌న త‌గ్గ‌డానికి యోగా, ధ్యానం వంటి వాటిని చేయాలి. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts