కరివేపాకులను చాలా మంది రోజూ కూరల్లో వేస్తుంటారు. కానీ వీటిని భోజనంలో తీసి పారేస్తారు. ఎవరూ తినరు. అయితే కరివేపాకుల వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. కరివేపాకులతో అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు. కరివేపాకుల వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అధిక బరువు, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారు రోజూ కరివేపాకును తింటే మంచిది. దీంతో అధిక బరువు తగ్గుతారు. పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. రోజూ భోజనం చేసేటప్పుడు మూడు పూటలా 1 టీస్పూన్ కరివేపాకుల పొడిని భోజనం మొదటి ముద్దలో కలిపి తింటుండాలి. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
2. పలుచని మజ్జిగలో ఒక టీస్పూన్ కరివేప ఆకుల పొడి కలిపి తాగితే మలబద్దకం, విరేచనాలు తగ్గుతాయి.
3. ఉదయం పరగడుపునే 5-6 కరివేపాకులను అలాగే నమిలి తినాలి. దీని వల్ల వికారం, వాంతులు తగ్గుతాయి. గర్భిణీలు పరగడుపునే ఈ విధంగా తింటే వారిలో మార్నింగ్ సిక్‌నెస్ తగ్గుతుంది.
4. కరివేపాకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల కరివేపాకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజుకు రెండు సార్లు ఒక కప్పు మోతాదులో తాగుతుండాలి. దీంతో విష జ్వరాల నుంచి త్వరగా కోలుకోవచ్చు. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
5. రోజూ ఉదయాన్నే పరగడుపునే 10 కరివేపాకులను అలాగే నమిలి తింటున్నా లేదా భోజనానికి ముందు రెండు పూటలా 2 టీస్పూన్ల కరివేపాకుల రసం తాగుతున్నా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
6. రోజూ ఉదయాన్నే పరగడుపునే కరివేపాకులను తింటుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయి.
7. కాలిన గాయాలు, పుండ్లపై కరివేపాకుల పేస్ట్‌ను రాసి కట్టు కడుతుండాలి. దీంతో అవి త్వరగా మానుతాయి.
8. కరివేపాకులను పేస్ట్‌లా చేసి జుట్టుకు రాసి కొంత సేపటి తరువాత తలస్నానం చేయాలి. వారంలో ఇలా రెండు సార్లు చేస్తుంటే జుట్టు పెరుగుతుంది. శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. చుండ్రు సమస్య తగ్గుతుంది.
9. కరివేపాకులను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వృద్ధుల్లో మతిమరుపు సమస్య తగ్గుతుంది.