హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసే ప‌వ‌ర్‌ఫుల్ మెడిసిన్ ఈ పండు.. దీంతో స‌మ‌స్య‌ల‌న్నీ దూరం..!

కివీ పండ్లు ఒక‌ప్పుడు కేవ‌లం న‌గ‌రాల్లోనే ల‌భించేవి. కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటిని ఎక్కువ‌గా విక్ర‌యిస్తున్నారు. ఇవి చాలా అద్భుత‌మైన పోష‌క విలువ‌ల‌ను, ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల కివీ పండ్ల‌ను రోజూ తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. రోజుకు ఒక కివీ పండును తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసే ప‌వ‌ర్‌ఫుల్ మెడిసిన్ ఈ పండు.. ప్లేట్‌లెట్ల‌ను పెంచుతుంది, డ‌యాబెటిస్‌ను త‌గ్గిస్తుంది..!!

1. కివీ పండ్ల‌లో అద్భుత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువ‌ల్ల డెంగ్యూ వ‌చ్చిన వారు ఈ పండ్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తినాలి. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. త్వ‌ర‌గా డెంగ్యూ నుంచి కోలుకుంటారు.

2. కివీ పండ్ల‌లో విట‌మిన్ ఎ, సి, కె లు స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల రోగాల బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూసుకోవ‌చ్చు. ముఖ్యంగా విష జ్వ‌రాల బారిన ప‌డ‌కుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు.

3. కివీ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. దగ్గు, జ‌లుబు, ఆస్త‌మా వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది.

4. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి కివీ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

5. కివీ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క్యాన్సర్ రాకుండా చూసుకోవ‌చ్చు. క్యాన్స‌ర్‌తో పోరాడే గుణాలు కివీ పండ్ల‌లో ఉన్నాయి. క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకునే స‌మ్మేళ‌నాల‌ను కివీ పండ్ల‌లో ఉంటాయి. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తింటే క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి.

6. కివీ పండ్ల‌లో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. అలాగే ఫైటో కెమిక‌ల్స్, లుటీన్‌, జియాజంతిన్ ఉంటాయి. ఇవ‌న్నీ క‌ళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కంటి చూపును మెరుగు ప‌రుస్తాయి.

7. నిద్ర‌లేమి ఉన్న‌వారు రోజూ రాత్రి నిద్ర‌కు ముందు కివీ పండ్ల‌ను తింటే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. త్వ‌ర‌గా నిద్ర ప‌డుతుంది.

8. కివీ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి, ఇ లు చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. చ‌ర్మంపై ముడ‌త‌లు ఏర్ప‌డ‌కుండా కాంతివంతంగా మారుస్తాయి.

9. కివీ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది క‌నుక మ‌న శ‌రీరం దాని స‌హాయంతో మ‌నం తినే ఆహారాల్లో ఉండే ఐర‌న్‌ను ఎక్కువ‌గా శోషించుకుంటుంది. దీంతో రక్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

10. కివీ పండ్ల‌లో ఉండే విట‌మిన్లు ఇ, సి, పొటాషియంలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌కుండా చూస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా అడ్డుకోవ‌చ్చు.

Share
Admin

Recent Posts