Cardamom : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి యాలకులను వంట ఇంటి దినుసుగా ఉపయోగిస్తున్నారు. వీటిని మసాలా వంటలతోపాటు తీపి వంటల్లోనూ వేస్తుంటారు. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే ఆయుర్వేద ప్రకారం యాలకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కనుక వీటిని రోజూ తినాలి. భోజనం చేసిన తరువాత ఒక యాలక్కాయను నోట్లో వేసుకుని నమిలి మింగవచ్చు. లేదా నీటిలో యాలక్కాయలను వేసి మరిగించి తాగవచ్చు. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. యాలకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. భోజనం చేసిన తరువాత రెండు యాలక్కాయలను నోట్లో వేసుకుని నమిలి మింగాలి. దీంతో మలబద్దకం అనే సమస్యలే ఉండదు. పేగుల్లోని మలం మొత్తం కడిగేసినట్లు బయటకు వస్తుంది. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు ఉండవు. జీర్ణ వ్యవస్థ మొత్తం శుభ్రంగా మారుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది.
2. యాలకులను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తశుద్ధి అవుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
3. నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు యాలకులను తింటుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతో నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన నుంచి విముక్తి పొందుతారు. అలాగే దంతాలు, చిగుళ్లు కూడా దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.
4. రోజూ రాత్రి భోజనం చేసిన అనంతరం యాలకులను నమిలినా.. లేదా యాలకులతో తయారు చేసిన టీ ని తాగినా.. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. అలాగే మనస్సు ప్రశాంతంగా మారి నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు.
5. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి యాలకులు ఒక వరమనే చెప్పాలి. వీటిని రోజూ నమలడం వల్ల శరీరంలోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది.