అనాస పువ్వు గురించి మీకు తెలియని నిజాలు..! ఎన్ని వ్యాధుల‌కు ప‌నిచేస్తుందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన దేశంలో రోజూ ఎన్నో రకాల మసాలా దినుసులను చాలా మంది వాడుతుంటారు&period; వాటిల్లో అనాస పువ్వు ఒకటి&period; దీన్నే స్టార్‌ అనీస్‌ అంటారు&period; దీన్ని ఆయుర్వేదంలో అద్భుతమైన మసాలా దినుసుగా చెబుతారు&period; ఎందుకంటే ఇది అనే వ్యాధులను తగ్గిస్తుంది&period; జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది&period; అందువల్ల అనాస పువ్వుతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5636 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;star-anise&period;jpg" alt&equals;"అనాస పువ్వు గురించి మీకు తెలియని నిజాలు&period;&period;&excl; ఎన్ని వ్యాధుల‌కు à°ª‌నిచేస్తుందంటే&period;&period;&quest; " width&equals;"750" height&equals;"542" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; అనాస పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి&period; అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period; శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ నశిస్తాయి&period; ఈ పువ్వులో ఉండే యాంటీ ఫంగల్‌&comma; యాంటీ బాక్టీరియల్‌ గుణాలు&comma; విటమిన్‌ ఎ&comma; సి లు దగ్గు&comma; జలుబును తగ్గించడంలో అమోఘంగా పనిచేస్తాయి&period; ఈ పువ్వులో షికిమిక్‌ యాసిడ్‌ ఉంటుంది&period; ఇది ఆస్తమా&comma; బ్రాంకైటిస్‌ సమస్యలను తగ్గిస్తుంది&period; అందువల్ల అనాస పువ్వు శ్వాస కోశ సమస్యలు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; అనాస పువ్వు తియ్యని సువాసనను కలిగి ఉంటుంది&period; అందువల్ల ఈ పువ్వు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది&period; బీపీని తగ్గిస్తుంది&period; సహజసిద్ధమైన పెయిన్‌ కిల్లర్‌గా కూడా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; మార్కెట్‌లో మనకు స్టార్‌ అనీస్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ లభిస్తుంది&period; దీన్ని రాయడం వల్ల వెన్ను నొప్పి&comma; కీళ్ల నొప్పులు&comma; ఆర్థరైటిస్‌ నొప్పులు&comma; వాపులు తగ్గుతాయి&period; ఈ ఆయిల్‌తో రోజూ సంబంధిత భాగాల్లో మర్దనా చేస్తే ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఆయుర్వేద ప్రకారం అనాస పువ్వులో సెడేటివ్‌ గుణాలు ఉంటాయి&period; అంటే దీన్ని తీసుకుంటే నాడులు ప్రశాంతంగా మారుతాయి&period; నిద్ర చక్కగా పడుతుంది&period; నిద్రలేమి నుంచి బయట పడవచ్చు&period; రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్‌ నీటిలో రెండు అనాస పువ్వులు వేసి మరిగించి ఆ నీటిని తాగాలి&period; దీంతో నిద్ర బాగా పడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5634 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;star-anise2&period;jpg" alt&equals;"అనాస పువ్వు గురించి మీకు తెలియని నిజాలు&period;&period;&excl; ఎన్ని వ్యాధుల‌కు à°ª‌నిచేస్తుందంటే&period;&period;&quest; " width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాని వారు&comma; అజీర్ణం సమస్య ఇబ్బందులకు గురి చేస్తున్న వారు అనాస పువ్వును తీసుకోవాలి&period; దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది&period; గ్యాస్‌&comma; మలబద్దకం తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలోనూ ఈ పువ్వు బాగానే పనిచేస్తుంది&period; దీన్ని కొద్దిగా నీటితో కలిపి పేస్ట్‌లా నూరి ఇన్‌ఫెక్షన్‌పై అప్లై చేయాలి&period; దీంతో ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; ముఖంపై ఏర్పడే ముడతలు&comma; మచ్చలను ఈ పువ్వు తగ్గిస్తుంది&period; అందుకు గాను ఈ పువ్వుకు చెందిన ఎసెన్షియల్‌ ఆయిల్‌ను వాడవచ్చు&period; ఈ నూనె రాస్తుంటే మొటిమలు&comma; మచ్చలు పోతాయి&period; అలాగే జుట్టుకు రాస్తే జుట్టు బాగా పెరుగుతుంది&period; శిరోజాలు దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; అనాస పువ్వు చూర్ణాన్ని తీసుకోవడం వల్ల స్త్రీ&comma; పురుషుల్లో హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి&period; దీంతో శృంగార సామర్థ్యం పెరగడంతోపాటు సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనాస పువ్వును అధిక మోతాదులో తీసుకుంటే విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి&period; కనుక సమస్య ఉన్నప్పుడు కొద్ది మోతాదులో తీసుకోవాలి&period; పావు టీస్పూన్‌ అనాస పువ్వు చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు&period; లేదా ఆయిల్‌ను పది చుక్కలు వాడవచ్చు&period; ఈ పువ్వును ఒకటి లేదా రెండు వేసి నీటిలో మరిగించి తాగవచ్చు&period; దీంతో పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts