అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు అద్భుతంగా ప‌నిచేసే నాగ‌కేస‌ర పువ్వులు.. ఏవిధంగా తీసుకోవాలో తెలుసుకోండి..!

మందార పువ్వు, గులాబీలు, చేమంతి పువ్వులు.. ఇలా ర‌క ర‌కాల పువ్వులు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అలాగే నాగ‌కేస‌ర పువ్వులు కూడా ఒక‌టి. వీటిల్లో అనేక ఔష‌ధ‌గుణాలు ఉంటాయి. అవి మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తాయి. నాగ‌కేస‌ర ప‌వ్వుల‌తో ఏయే వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

home remedies using nagkesar flowers

* ఈ సీజ‌న్‌లో స‌హ‌జంగానే చాలా మందికి జ‌లుబు వ‌స్తుంటుంది. అయితే నాగ‌కేస‌ర పువ్వుతో జ‌లుబును త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు గాను.. ఈ పువ్వును తీసుకుని బాగా న‌లిపి పేస్ట్‌లా చేసి ఆ మిశ్ర‌మాన్ని నుదుటిపై రాయాలి. దీంతో జ‌లుబు త‌గ్గుతుంది.

* ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నాగ‌కేస‌ర పువ్వుల పొడి, తేనె ల‌ను క‌లిపి తీసుకోవాలి. దీంతో అజీర్ణం, అసిడిటీ, గ్యాస్, క‌డుపునొప్పి, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

* వెక్కిళ్లు వ‌చ్చాయంటే ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు. కానీ నాగ‌కేస‌ర పువ్వుల పొడితో వెక్కిళ్ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు గాను ఆ పువ్వుల పొడిని తేనెతో తీసుకోవాలి. అదే పొడిని చెరుకు ర‌సంతో క‌లిపి కూడా తీసుకోవ‌చ్చు. దీంతో వెక్కిళ్లు త‌గ్గిపోతాయి.

* నాగ‌కేస‌ర పువ్వుల‌తో త‌యారు చేసే నూనె మ‌న‌కు ల‌భిస్తుంది. దాన్ని కీళ్ల‌పై మ‌ర్ద‌నా చేసిన‌ట్లు రాస్తుండాలి. దీంతో కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.

* నాగ‌కేస‌ర పువ్వుల పొడిని తేనెతో క‌లిపి తీసుకుంటుంటే జ్వ‌రం కూడా త‌గ్గుతుంది. పావు టీస్పూన్ తేనెను అర టీస్పూన్ పొడితో క‌లిపి తీసుకోవాలి. దీన్ని రోజుకు 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది.

* నాగ‌కేస‌ర పువ్వుల పొడిని తేనెతో క‌లిపి తీసుకుంటుంటే పైల్స్‌, ఆస్త‌మా వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఆ మిశ్ర‌మాన్ని రోజుకు 1 లేదా 2 సార్లు తీసుకోవాలి.

* నాగ‌కేస‌ర నూనెను గాయాలు, పుండ్ల‌పై రాస్తుంటే అవి త్వ‌ర‌గా మానుతాయి.

* ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో అర టీస్పూన్ నాగ‌కేస‌ర పువ్వుల పొడిని క‌లిపి తాగితే త‌ల‌నొప్పి త‌గ్గుతుంది.

Admin

Recent Posts