రోజూ ఉదయాన్నే బెడ్ మీద ఉండగానే కొందరు కాఫీ తాగుతుంటారు. కాఫీ అంటే కొందరికి చాలా ఇష్టం ఉంటుంది. అందువల్ల రోజంతా కాఫీని తాగుతూనే ఉంటారు. అయితే కాఫీ వల్ల నిజానికి పలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* కాఫీలో ఉండే కెఫీన్ మెదడును యాక్టివ్‌గా మారుస్తుంది. చురుగ్గా ఉంటారు. అప్రమత్తత పెరుగుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
* కాఫీ తాగడం వల్ల మన శరీర మెటబాలిజం 3-11 శాతం వరకు పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. అధిక బరువు తగ్గుతారు.
* కాఫీలో రైబోఫ్లేవిన్, విటమిన్ బి5, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషణను అందిస్తాయి.
* ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది టైప్ 2 డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే రోజుకు కనీసం 2 కప్పుల కాఫీని తాగితే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 23-50 శాతం వరకు తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది.
* అల్జీమర్స్, దెమెన్షియా వంటి సమస్యలు రాకుండా చూడడంలో కాఫీ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
* రోజూ కాఫీ తాగడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. హెపటైటిస్, ఇతర లివర్ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
* డిప్రెషన్ తో బాధపడుతున్న వారు రోజూ కాఫీని తాగితే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
* కాఫీని రోజూ తాగడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.
అయితే కాఫీ తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ దాన్ని పరిమితంగా తాగితేనే ప్రయోజనాలు కలుగుతాయి. ఎక్కువగా తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. రోజుకు 2-3 కప్పుల వరకు కాఫీ తాగవచ్చు. అంతకు మించితే దుష్పరిణామాలు కలుగుతాయి.