Shatavari Powder : మన జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే యాసిడ్ లలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒకటి. మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వడంలో దీని పాత్ర అధికంగా ఉంటుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ చాలా ఘాటుగా ఉంటుంది. దీని గాఢత 0.8 పిహెచ్ నుండి 1.2 పిహెచ్ మధ్య ఉంటుంది. మనం ఇంట్లో వినియోగించే యాసిడ్ ఎంత ఘాటుగా ఉంటుందో మన జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంతే ఘాటుగా ఉంటుంది. మనం తినే ఆహారం ద్వారా వచ్చే క్రిములను చంపి, ఆహారం పిండిలా జీర్ణం అయ్యేలా చేయడంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవసరం చాలా ఉంటుంది.
ఈ యాసిడ్ మన జీర్ణాశయంలో ఒకటి నుండి ఒకటిన్నర లీటర్ వరకు ఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తి అవ్వడం మంచి ఆరోగ్యానికి నిదర్శనం.
కానీ కొంత మందిలో ఈ యాసిడ్ మూడు లీటర్ల వరకు ఉత్పత్తి అవుతుంటుంది. కొన్ని రకాల మందులు వాడడం వల్ల, మానసిక ఒత్తిడి, టీ, కాఫీలను అధికంగా తాగడం, కోపం ఎక్కువగా ఉండడం వల్ల హైడ్రో క్లోరిక్ యాసిడ్ అవసరానికి మించి ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల కడుపులో అసౌకర్యంగా ఉండడం, కడుపులో మంట, అల్సర్, పుల్లటి త్రేన్పులు వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుండి బయట పడడానికి మనం రకరకాల టానిక్ లను తాగడం, మందులు వాడడం వంటివి చేస్తూ ఉంటాం. వీటి వల్ల ప్రయోజనం అంతగా ఉండదు.
శరీరానికి కూడా టానిక్‌లు హాని కలిగిస్తాయి. అయితే ఆయుర్వేదం ద్వారా చాలా సహజ సిద్దమైన పద్దతిలో ఈ సమస్య నుండి బయట పడవచ్చు. శతావరి పొడిని వాడడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ తగినంత ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల కడుపులో మంట, అల్సర్ వంటి సమస్యలు తగ్గి జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. శతావరి పొడి ఈ సమస్యలను తగ్గిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
శతావరి పొడిని ఎప్పుడు, ఎలా వాడాలి.. అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ శతావరి పొడిని వేసి సగం గ్లాసు అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. ఈ కషాయాన్ని భోజనానికి అర గంట ముందు తాగడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ తగినంత ఉత్పత్తి అవుతుంది. దీంతో కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.