అనారోగ్యాల బారిన పడినప్పుడు లేదా కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకిన వారికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఊపిరి సరిగ్గా ఆడదు. దీంతో తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. ఒక్కోసారి మెట్లు ఎక్కుతున్నప్పుడు, చలి వాతావరణం ఉన్నప్పుడు, అనారోగ్యాల బారిన పడినప్పుడు, అధిక బరువు ఉన్నవారికి ఈ సమస్య వస్తుంటుంది. అయితే కొందరిలో ఈ సమస్య తాత్కాలికంగా ఉంటుంది. కానీ కొందరిలో తీవ్రతరం అవుతుంది. అందువల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే నిర్లక్ష్యం చేయరాదు. వెంటనే స్పందించాలి. ఇక కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. శ్వాస సరిగ్గా ఆడుతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. అల్లంతో తయారు చేసిన టీ తాగడం వల్ల శ్వాస సమస్యలు తగ్గుతాయి. శ్వాసకోశ వ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పడుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఊపిరితిత్తుల్లో ఉండే వాపులు తగ్గుతాయి. అల్లం ముక్కలు నీటిలో వేసి దాంతో డికాషన్ తయారు చేసి తాగితే మంచిది. లేదా నేరుగా అల్లం రసాన్ని కూడా తాగవచ్చు. దీంతో శ్వాస సమస్యలు తగ్గుతాయి.
2. బ్లాక్ కాఫీ తాగడం వల్ల నాసికా రంధ్రాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. ఊపిరితిత్తుల్లో ఉండే రంధ్రాలు క్లియర్ అవుతాయి. ఆస్తమా ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది. శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి.
3. ఒక గోడకు శరీరాన్ని ఆనించి నిలబడాలి. చేతులను తొడలపై ఉంచాలి. భుజాలను వెనక్కి ఆనించి రిలాక్స్ అవ్వాలి. ఈ భంగిమలో కొంత సేపు ఉండాలి. ఎప్పటికప్పుడు ఇలా చేయడం వల్ల శ్వాస సరిగ్గా ఆడుతుంది.
4. నేలపై పద్మాసనంలో కూర్చోవాలి. వెన్నెముకను నిటారుగా ఉంచాలి. నోటితో గాలిని పీల్చాలి. 4-5 సెకన్ల పాటు నోట్లోనే గాలిని అలాగే ఉంచాలి. పెదాలను మూసి ముక్కుతో 4 సెకన్ల పాటు శ్వాసను బయటకు వదలాలి. ఇలా రోజుకు 10-15 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
5. కుర్చీలో కూర్చుని ఉండి రిలాక్స్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల కూడా శ్వాసక్రియ మెరుగు పడుతుంది. అందుకు గాను కుర్చీలో కూర్చుని కాళ్లను నేలపై ఆనించి ముందుకు వంగాలి. అనంతరం మోచేతులను మోకాళ్లపై ఉంచాలి. చేతులతో గడ్డం పట్టుకుని మెడను, భుజాలను ముందుకు వంచి రిలాక్స్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల శ్వాస క్రియ మెరుగు పడుతుంది.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365