Immunity : ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అందులోనూ వానా కాలం మొదలైంది. దగ్గు, జలుబు ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుకుంటే, అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి..?, వేటిని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇటువంటి ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ తీసుకోవడం వలన విటమిన్ సి అందుతుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుకోవడానికి అవుతుంది. కనుక నిమ్మని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. బాదంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి రోజు నానబెట్టిన బాదం పప్పును తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తిని సులభంగా పెంచుకోవచ్చు. విటమిన్ ఈ తో పాటుగా జలుబు నుండి రక్షణని కూడా బాదం ఇస్తుంది.
పెరుగును తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. కనుక రెగ్యులర్ గా పెరుగుని కూడా తీసుకుంటూ ఉండండి. తేనె కూడా రోజు తీసుకోవడం మంచిది. రోజూ తేనెని తీసుకుంటే ఇమ్యూనిటీని సులభంగా పెంచుకోవచ్చు. పసుపు కూడా ఇమ్యూనిటీని పెంచేందుకు సహాయ పడుతుంది. పసుపుని వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉండండి.
పాలకూరని తీసుకుంటే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అల్లం ద్వారా కూడా మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. వెల్లుల్లి కూడా చక్కగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీని వెల్లుల్లి బాగా పెంచుతుంది. ఎండుద్రాక్షలో ఐరన్, ఫైబర్, జింక్, విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటాయి. ఎండుద్రాక్షను తీసుకుంటే కూడా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చు అనేది చూశారు కదా.. మరి ప్రతిరోజు వీటిని తీసుకుంటూ ఉండండి. రోగనిరోధక శక్తిని పెంచుకోండి. ఆరోగ్యంగా ఉండండి.