Aloe Vera For Hair Growth : క‌ల‌బంద గుజ్జుతో ఇలా చేస్తే.. మీ జుట్టు రాల‌దు.. వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..!

Aloe Vera For Hair Growth : మారిన మ‌న జీవ‌న విధానం, ఆహారపు అల‌వాట్ల కార‌ణంగా చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో జుట్టు రాల‌డం కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అందరూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు కుదుళ్ల‌కు పోష‌కాలు సరిగ్గా అందక అవి బ‌ల‌హీనప‌డి జుట్టు ఎక్కువ‌గా రాలిపోతూ ఉంటుంది. జుట్టును రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌డానికి మ‌న‌లో చాలా మంది బ‌ట‌య మార్కెట్ లో ల‌భించే నూనెల‌ను, యాంటీ హెయిర్ ఫాల్ షాంపుల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి ఫ‌లితం లేక తీవ్ర నిరాశ‌కు గురి అవుతూ ఉంటారు. జుట్టు రాలూ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు వీటికి బ‌దులుగా స‌హ‌జంగా ల‌భించే క‌ల‌బంద‌ను వాడ‌డం వ‌ల్ల మంచి ఫలితం ఉంటుంది.క‌లబంద‌లో ఉండే పోష‌కాలు, ఔష‌ధ గుణాలు జుట్టు కుదుళ్ల‌కు కావ‌ల్సిన పోష‌ణను అందించి కుదుళ్లు గ‌ట్టి ప‌డేలా దోహ‌దం చేస్తాయి.

పైగా క‌ల‌బందను వాడ‌డం వల్ల ఎటువంటి చెడు ప్ర‌భావం కూడా ఉండ‌దు. జుట్టు రాల‌డంతో బాధ‌ప‌డే వారు స‌హజంగా ల‌భించే ఈ క‌ల‌బంద‌తో కొన్ని చిట్కాల‌ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు క‌ల‌బంద‌ను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మ‌న‌కు త‌ల‌కురాసుకునే నూనెను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా 5టేబుల్ స్పూన్ల నూనెను గిన్నెలోకి తీసుకుని గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు వేడి చేయాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి గిన్నెను ప‌క్క‌కు తీసి అందులో 3 టేబుల్ స్పూన్ల క‌ల‌బంద గుజ్జు వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న నూనెన రాత్రి ప‌డుకునే ముందు జుట్టుకు బాగా ప‌ట్టించాలి. నూనె కుదుళ్లల్లోకి ఇంకేలా మ‌ర్ద‌నా చేయాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం క్ర‌మంగా త‌గ్గుతుంది.

Aloe Vera For Hair Growth use in this method
Aloe Vera For Hair Growth

అలాగే ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల క‌ల‌బంద గుజ్జును తీసుకోవాలి. త‌రువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ర‌సాన్ని వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివ‌ర్ల వ‌ర‌కు బాగా ప‌ట్టించాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే క‌ల‌బంద గుజ్జును నేరుగా జుట్టు కుదుళ్ల‌పై కూడా రాయ‌వ‌చ్చు. జుట్టును చిక్కులు లేకుండా బాగా దువ్వాలి. త‌రువాత క‌లబంద గుజ్జును నేరుగా జుట్టుకుదుళ్ల‌పై రాసి మ‌ర్ద‌నా చేయాలి. ఒక గంట త‌రువాత షాంపుతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల జుట్టు కుదుళ్లు బ‌ల‌ప‌డి జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.ఈ విధంగా క‌ల‌బంద‌ను వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గి జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.

Share
D

Recent Posts