Aloe Vera For Hair Growth : మనలో చాలా మంది వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు తెల్లబడడం, జుట్టు పెరగక పోవడం వంటి వాటిని మనం జుట్టు సమస్యలుగా చెప్పుకోవచ్చు. ఈ సమస్యలతో బాధపడే వారు నేటి తరుణంలో ఎక్కువవుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎంతగానో వేధించే ఈ జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లభించే అన్ని రకాల హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు. అయిన ఫలితం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఒక చక్కటి చిట్కాను పాటించడం వల్ల మనం చాలా సులభంగా జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు.
ఈ చిట్కాను తయారు చేయడం అలాగే వాడడం కూడా చాలా సులభం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ఎటువంటి ఖర్చు కూడా ఉండదు. అలాగే ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. జుట్టు సమస్యలను దూరం చేసే చక్కటి చిట్కా ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి..ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం 2 టీ స్పూన్ల టీ పొడిని, 2 టీ స్పూన్ల బియ్యాన్ని, కలబంద ఆకును, 4 మందార పువ్వులను, అర టీ స్పూన్ ఆముదాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టాలి. తరువాత ఒక గ్లాస్ నీటిలో టీ పొడి వేసి డికాషన్ లా చేసుకోవాలి. తరువాత దీనిని వడకట్టి పక్కకు ఉంచాలి.
తరువాత ఒక జార్ లో కలబంద గుజ్జు, మందార పువ్వులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ముందుగా సిద్దం చేసుకున్న 4 టీ స్పూన్ల బియ్యం నీరు, 4 టీ స్పూన్ల టీ డికాషన్, ఆముదం వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు పట్టించి గంట పాటు అలాగే ఉంచాలి. గంట తరువాత కుంకుడు కాయలతో లేదా రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో, ఆర్గానిక్ షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. అలాగే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు సమస్యలతో బాధపడే వారు ఈ విధంగా చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.