Mothichoor Laddu : స్వీట్ షాపుల్లో ల‌భించే మోతీ చూర్ ల‌డ్డూల‌ను శ్ర‌మ ప‌డ‌కుండా ఇలా చేయండి..!

Mothichoor Laddu : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో మోతీచూర్ ల‌డ్డూలు కూడా ఒక‌టి. ఈ ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మ‌నం ఈ మోతీచూర్ ల‌డ్డూల‌ను ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే చాలా మంది వీటిని త‌యారు చేసుకోవ‌డానికి చిన్న రంధ్రాలు ఉన్న జ‌ల్లి గంటె ఉండాలి. అలాగే వీటిని త‌యారు చేయ‌డం చాలా శ్ర‌మంతో కూడుకున్న ప‌ని అని భావిస్తారు. కానీ గంటెతో అవ‌స‌రం లేకుండా చాలా సుల‌భంగా చాలా త‌క్కువ స‌మ‌యంలో ఈ ల‌డ్డూల‌ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఎవ‌రైనా వీటిని తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే మోతీచూర్ ల‌డ్డూల‌ను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మోతీచూర్ ల‌డ్డూ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ‌పిండి – ఒక క‌ప్పు, నీళ్లు -ఒక క‌ప్పు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, పంచ‌దార – ఒక క‌ప్పు, ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, క‌ర్జూజ గింజ‌లు -ఒక టేబుల్ స్పూన్.

Mothichoor Laddu recipe in telugu very easy to make and tasty
Mothichoor Laddu

మోతీచూర్ ల‌డ్డూ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో నీళ్లు పోసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా వేడ‌య్యాక గంటెతో పిండిని తీసుకుని రిబ్బ‌న్ లాగా లేదా మ‌న‌కు న‌చ్చిన ఆకారంలో నూనెలో వేసుకోవాలి. త‌రువాత వీటిని బూందీ మాదిరి లైట్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా పిండంత‌టిని వేయించిన త‌రువాత ఈ రిబ్బ‌న్ ల‌ను జార్ లో వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో పంచ‌దార‌, ఒక క‌ప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. పంచ‌దార క‌రిగి లేత తీగ‌పాకం రాగానే అందులో ఫుడ్ క‌ల‌ర్ వేసి క‌ల‌పాలి.

త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న శ‌న‌గ‌పిండి మిశ్ర‌మాన్ని వేసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు క‌లుపుతూ ఉడికించిన త‌రువాత నెయ్యి, క‌ర్జూజ గింజ‌లు వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మం కొద్దిగా చ‌ల్లారిన తరువాత ల‌డ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే మోతీచూర్ ల‌డ్డూ త‌యార‌వుతుంది. ఈ విధంగా బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఇంట్లోనే మోతీచూర్ ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts