Aloe Vera Gel : జుట్టు అందంగా, పొడవుగా పెరగాలని చాలా మంది కోరుకుంటారు. జుట్టును అందంగా ఉంచుకోవడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే అన్ని రకాల షాంపులను, నూనెలను, కండిష్ నర్ లను వాడుతూ ఉంటారు. అయితే ఎంత ఖర్చు చేసినప్పటికి జుట్టు సంబంధిత సమస్యలు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. జుట్టు యదావిధిగా రాలిపోతూనే ఉంటుంది. ఎటువంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే పదార్థాలతో మన జుట్టును ఒత్తుగా, అందంగా మార్చుకోవచ్చు. జుట్టును అందంగా, ఆరోగ్యంగా మార్చే ఇంటి చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ముఖ్యంగా కలబందను ఉపయోగించాల్సి ఉంటుంది. కలబందలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది.
ఈ విటమిన్ ఇ జుట్టు పెరుగుదలలో ఎంతగానో ఉపయోగపడుతుంది. జుట్టు కుదుళ్లకు కావల్సిన పోషకాలను అందించడంతో పాటు జుట్టు ఒత్తుగా , పొడవుగా పెరిగేలా చేయడంలో కూడా కలబంద మనకు సహాయపడుతుంది. అలాగే ఈచిట్కాను తయారు చేసుకోవడానికి మనం కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో తాజా కలబంద గుజ్జును వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లల్లోకి ఇంకేలా బాగా పట్టించాలి. తరువాత జుట్టంతటికి పట్టించాలి. తరువాత నూనెను జుట్టుకు కుదుళ్లలోకి ఇంకేలా సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించిన తరువాత ఒక గంట పాటు అలాగే ఉంచాలి. తరువాత హెర్బల్ లేదా ఆయుర్వేద షాంపును ఉపయోగించి తలస్నానం చేయాలి.
ఇలా క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. చిన్న వయసులోనే జుట్టు రాలిపోయి చాలా మంది అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. అలాంటి వారందరూ ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు క్రమం తప్పకుండా ఈ చిట్కాను వాడడం వల్ల సమస్యలు తగ్గి జుట్టు అందంగా, ధృడంగా తయారవుతుంది.