చిట్కాలు

ఉసిరికాయ‌లు మాత్ర‌మే కాదు, వాటి గింజ‌ల‌తోనూ ఎన్నో లాభాలు ఉన్నాయి..

కొన్ని కాయలే కాదు.. వాటిలో విత్తనాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెప్తుంటారు. ఖర్జూరం, చింతపండు విత్తనాలు ఇలా.. ఈ లిస్ట్‌లోకి ఉసిరికాయ కూడా చేరింది. ఉసిరికాయ గింజల్లో కూడా బోలెడు ఔషధగుణాలు ఉన్నాయట. ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉసిరి గింజలకు అంతే విశిష్టత ఉందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అసలు ఉసిరి గింజల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటే. ఉసిరి గింజలలో విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్ ఇంకా అలాగే యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉన్నాయి. ఉసిరి గింజలను ఎండబెట్టి దంచి బాగా పొడిచేసుకోవాలి. ఈ విత్తనాలు ఉసిరికాయతో సమానంగా శరీరానికి ప్రయోజనాలను చేకూర్చుతాయట.

ఉసిరి గింజల పొడిని ప్రతిరోజు కూడా తీసుకుంటూ ఉంటే జీర్ణ సంబంధిత సమస్యలను ఈజీగా తొలగిస్తుంది. ఉసిరి గింజల పొడిలో కొద్దిగా తేనె కూడా కలిపి తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కంటిలో దురద, మంట ఇంకా అలాగే కళ్లలో ఎర్రబారడం వంటి సమస్యలు ఉన్నవారు ఈ ఉసిరి గింజలను బాగా మెత్తగా నూరి కళ్లపైన ఇంకా అలాగే కింది భాగంలో రాసుకోవాలి. మలబద్ధకం, అజీర్ణం లేదా ఆమ్లత్వం సమస్యలతో బాధప‌డుతున్న వారు ఉసిరి గింజలతో తయారు చేసిన పొడిని గోరువెచ్చని నీళ్లలో వేసుకుని తాగొచ్చు. 10 గ్రాముల ఉసిరి గింజలను ఎండలో ఎండబెట్టి ఇంకా వాటిని మెత్తగా పొడిగా చేసుకోవాలి. అలాగే అందులో 20 గ్రాముల చ‌క్కెర పొడిని కలిపి ఉంచుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో 1 గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ పొడిని కలిపి 15 రోజుల పాటు రోజూ తీసుకుంటే.. నిద్రలేమి నుండి బయట పడవచ్చు.

amla seeds are also very useful for us

చర్మ సంబంధిత సమస్యలకు జామకాయ గింజలు, ఉసిరి గింజలను కొబ్బరి నూనెలో వేసి వాటిని పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని మొటిమలున్న ప్రదేశాల్లో అప్లై చేస్తే త్వరగా పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. కొందరికి ముక్కు నుంచి కూడా రక్తస్రావం వస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఇలా ఎక్కువగా జరుగుతుంది..సమస్య ఉన్నవారు.. ఉసిరి గింజల పేస్ట్‌ని రాస్తే సరిపోతుంది. ఈ ఉసిరి గింజలకు కాస్త నీటిని కలిపి గ్రైండ్ చేసి బాగా పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ను మీ నుదిటిపై అప్లై చేస్తే తలనొప్పి సమస్య కూడా చాలా ఈజీగా తగ్గుతుంది.

Admin

Recent Posts