వైద్య విజ్ఞానం

త‌ర‌చూ మీకు గుండె ద‌డ‌గా ఉంటుందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోండి..

ఆరోగ్యంగా ఉండటం అంటే పైకి అందంగా కనపించడం కాదు.. చూడ్డానికి హెల్తీగానే ఉంటారు కానీ లోపల ఏదో తెలియని టెన్షన్‌. ఒక్కోసారి మనసు గందరగోళంగా, భయం భయంగా, హార్ట్‌ బీట్‌ ఉన్నట్టుండి పెరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. ఏదైనా కీడు జరుగుతుందని మనం అలా ఆలోచిస్తాం. కానీ ఇలా తరచూ జరుగుతుందంటే.. మీ బాడీలో విటమిన్‌ b12లోపం ఏర్పడినట్లే.! నిజానికి ఇది అన్ని విటమిన్లలా కాదు. మీరు సరిపడా అందిస్తే.. నాలుగు సంవత్సరాల వరకూ అయినా బాడీ నిల్వచేసుకుంటుంది. అయినా నేడు చాలామంది ఈ విటమిన్‌ లోపంతో బాధపడుతున్నారు.. ఆ విషయం వారికి కూడా తెలియదు. విటమిన్ బి12, కోబాలమిన్ అనేది నీటిలో కరిగే పోషకం. ఇది ప్రధానంగా జంతువుల నుంచి ఆహారంలో లభిస్తుంది. నీటిలో కరిగే విధంగా, ఈ విటమిన్ నీటిలో కరిగి రక్తప్రవాహంలో ప్రయాణించగలదు. ఎర్రరక్తకణాలు, డీఎన్‌ఏ ఏర్పడడం వంటి అనేక విధులకు మన శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పోషకాలలో విటమిన్ b12 ఒకటి. మెదడు, నరాల కణాల అభివృద్ధిలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

విటమిన్‌ b12 లోపం వల్ల రక్తహీనత, జీర్ణకోశ సంబంధిత సమస్యలైన పెప్టిక్ అల్సర్ వ్యాధి, గ్యాస్ట్రినోమా, జోలింగర్ ఎల్లిసన్ సిండ్రోమ్ వంటివి వ‌స్తాయి. విటమిన్ బి12 శోషణను ప్రతికూలంగా ప్రభావితం చేసే కొన్ని మందుల ద్వారా కూడా సమస్య వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. విటిమిన్ b12 లోపిస్తే అలసట, శ్వాస ఆడకపోవడం, తలనొప్పి, కళ్ళు తిరగడం, చర్మం పాలిపోవడం, గుండెదడ, జీర్ణ సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

if you are getting heart palpitations regularly then know what it means

మాంసం, చేపలు, పాలు, చీజ్, పెరుగు, గుడ్లలో ఎక్కువగా ఈ విటమిన్‌ లభిస్తుంది. అదే విధంగా తృణధాన్యాల్లో కూడా బీ12 ఉంటుంది. కాబట్టి ఈ ఫుడ్‌ని మీ డైట్‌లో చేర్చుకోవడం మంచిది.! అయితే వారానికి ఒకసారైన మాంసాహారులు..నాన్‌వెజ్‌ తినడం మంచిది. వాటిల్లోనే శ‌రీరానికి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ఇక శాకాహారులు అయితే తృణధాన్యాలు, పప్పులు, ఎండువిత్తనాలు ద్వారా లోపాన్ని భర్తీ చేయొచ్చు.

Admin

Recent Posts