Apple Cider Vinegar : నేటి తరుణంలో అధిక బరువు సమస్య జనాలను ఏవిధంగా ఇబ్బందులకు గురి చేస్తుందో అందరికీ తెలిసిందే. అధిక బరువు కారణంగా అనేక మందికి హార్ట్ ఎటాక్స్, డయాబెటిస్ వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. దీంతో బరువును తగ్గించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ ను వాడితే వేగంగా బరువు తగ్గవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మరి బరువును తగ్గించుకునేందుకు దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందామా.
యాపిల్ సైడర్ వెనిగర్ 2 టీస్పూన్లు, దాల్చిన చెక్క పొడి 2 టీస్పూన్లు తీసుకుని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ నీటిలో కలుపుకుని నిత్యం మూడు పూటలా తాగితే కొద్ది రోజుల్లోనే అధిక బరువు తగ్గుతారు. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల తేనె, యాపిల్ సైడర్ వెనిగర్‌లను కలుపుకుని తాగితే అధిక బరువు త్వరగా తగ్గుతుంది. మీకు ఇష్టమైన ఏదైనా పండు రసాన్ని తీసి అందులో 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి తాగినా బరువు తగ్గవచ్చు. నిత్యం ఇలా రెండు సార్లు తాగాలి. కానీ అందులో చక్కెర కలపరాదు.
గ్రీన్ టీ లో యాపిల్ సైడర్ వెనిగర్ ను కలుపుకుని తాగినా బరువు తగ్గవచ్చు. ఫ్రూట్ సలాడ్స్, వెల్లుల్లి రసంతో కూడా యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతారు. యాల్ సైడర్ వెనిగర్‌ను పైన చెప్పిన విధంగా తాగితే కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, మధుమేహం, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.