Asafoetida : ఇంగువ‌ను ఇలా తీసుకుంటే.. ఎన్నో స‌మ‌స్య‌ల‌కు విరుగుడుగా ప‌నిచేస్తుంది..

Asafoetida : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఇంగువ‌ను ఉప‌యోగిస్తున్నారు. ఇంగువ‌ను అనేక వంట‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే వాస్త‌వానికి ఇంగువ ఆయుర్వేదం ప్ర‌కారం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక దీంతో ప‌లు వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే అందుకు ఇంగువ ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Asafoetida can get rid of many health problems
Asafoetida

పిల్లలకు తిన్న అన్నం జీర్ణంకాక కడుపు నొప్పి వస్తుంది. దాంతో వారు నోరు తెరిచి చెప్పలేరు. అలాంటి సమయంలో కడుపు గట్టిగా ఉందో లోదో చెక్‌ చేసి శొంఠి ఇస్తారు. ఇలా శొంఠి మాత్రమే కాకుండా ఇంగువ కూడా ఉపయోగపడుతుంది. కాస్త ఇంగువ‌ను తినిపిస్తే చిన్నారుల‌కు క‌లిగే జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే పెద్ద‌లు కూడా దీన్ని భోజ‌నం అనంత‌రం కాస్త తీసుకోవ‌చ్చు. దీంతో అజీర్ణం, గ్యాస్ వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ఇక ఇంగువను పురాతన కాలం నుంచి అజీర్తికి ఇంటి వైద్యంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో కడుపు మంటను తగ్గించే గుణం, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు ఉన్నాయి. ఇది అజీర్తి లక్షణాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. అరకప్పు నీటిలో కొన్ని ఇంగువ ముక్కలను కరిగించి తీసుకోవాలి. దీంతో అజీర్తి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. స్త్రీలకు సంబంధించిన రుతు సంబంధ సమస్యలు.. అంటే.. నొప్పి, తిమ్మిరి బాధతో కూడిన రుతుక్రమాలు వంటి వాటికి ఇంగువ ఒక శక్తివంతమైన మందు. రోజూ ఆహారంలో ఇంగువను భాగం చేసుకుంటే స్త్రీ సంబంధిత సమస్యలు ఎదురుకావు.

శ్వాసను ఉత్తేజ పరిచే మందుగా, కఫం తగ్గించడానికి, ఛాతిపైన ఒత్తిడి తగ్గించడానికి ఇంగువ పనిచేస్తుంది. తేనె, అల్లంతో కూడిన ఇంగువను తీసుకుంటే దీర్ఘకాలంగా ఉన్న పొడిదగ్గు, కోరింత దగ్గు, శ్వాస నాళాల‌ వాపు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇంగువను డయాబెటిస్‌ వైద్యంలో కూడా వాడుతారు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి తద్వారా మరింత ఇన్సులిన్‌ స్రావాన్ని ఉత్పత్తి చేయడానికి సహాయం పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల‌ని తగ్గించడానికి కాకరకాయను ఇంగువతో కలిపి వండాలి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.

ఇంగువలో ఉన్న కొమరిన్‌లు రక్తాన్ని పలుచగా చేసి రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తాయి. ఇంగువ వైద్య ప్రభావంతో అధిక ట్రైగ్లిజరైడ్స్‌, కొలెస్ట్రాల్‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. దీంతో హార్ట్ ఎటాక్‌లు రావు. అలాగే బీపీని త‌గ్గించేందుకు కూడా ఇంగువ ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌నుక ఇంగువ‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Editor

Recent Posts