Mushroom Biryani : పుట్ట‌గొడుగుల‌తో బిర్యానీ.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..

Mushroom Biryani : పుట్ట‌గొడుగుల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటిల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అందుక‌నే వైద్యులు మ‌న‌ల్ని వీటిని తిన‌మ‌ని సూచిస్తుంటారు. అయితే పుట్ట‌గొడుగుల‌తో కూర కాకుండా వెరైటీగా బిర్యానీని కూడా వండుకుని తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పుట్ట‌గొడుగుల‌తో బిర్యానీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Mushroom Biryani very easy to make recipe is here
Mushroom Biryani

పుట్టగొడుగుల బిర్యానీ త‌యారీకి కావాల్సిన ప‌దార్థాలు..

బాస్మతి బియ్యం – పావుకేజి, పుట్టగొడుగులు – పావుకేజి, నెయ్యి – 3 టేబుల్‌స్పూన్లు, నూనె – 3 టేబుల్‌స్పూన్లు, ఉల్లిగడ్డ – 1, పచ్చిమిర్చి – 2, టమాట – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా – 1 టేబుల్‌స్పూన్, పెరుగు – పావుకప్పు, బిర్యానీ దినుసులు – తగినన్ని, కొత్తిమీర, పుదీనా – సరిపడా, ఉప్పు – తగినంత, నీరు – సరిపడా.

పుట్టగొడుగుల బిర్యానీని తయారు చేసే విధానం..

గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బిర్యానీ దినుసులు వేసి దోరగా వేయించాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. దీంట్లో మసాలా, పెరుగు, పుట్టగొడుగులు వేసి అయిదు నిమిషాలు వేగాక తగినన్ని నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేయాలి. అలాగే కొత్తిమీ,ర పుదీనా కూడా వేయాలి. నీళ్లు బాగా తెర్లేటప్పుడు బియ్యం వేయాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు చిన్న మంటపై ఉంచాలి. పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇక అంతే ఘుమఘుమలాడే పుట్టగొడుగుల బిర్యాని రెడీ. దీన్ని కుర్మాతో తింటే టేస్ట్ అదిరిపోతుంది. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
Editor

Recent Posts