చిట్కాలు

ఆయాసం తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

సృష్టిలో ప్రతి జీవికి ఆక్సిజన్‌ అవసరం. ఆక్సిజన్‌ పీల్చుకుని మనం కార్బన్‌ డయాక్సైడ్‌ను విడిచి పెడతాం. ఆక్సిజన్‌ వల్ల మన శరీరంలోని ఆహారం దహన ప్రక్రియకు గురవుతుంది. దీంతో మనకు శక్తి లభిస్తుంది. అయితే గాలిని పీల్చుకుని వదలడం కొందరికి కష్టంగా ఉంటుంది. దీన్నే ఆయాసం అంటారు. ఆయాసం వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి.

ayaasam taggenduku ayurveda chitkalu

శ్వాసకోశ వ్యవస్థలో ఏవైనా అడ్డంకులు ఏర్పడినా, ఊపిరితిత్తుల్లోని పొరలు కుచించుకుపోవడం వల్ల, ముక్కు, గొంతు, జీర్ణాశయాల్లో వచ్చే వ్యాధుల వల్ల, కొన్ని రకాల పదార్థాలు, వాసనలు పడకపోవడం వల్ల, వాతావరణ ప్రభావం చేత, గుండెలో వచ్చే మార్పుల వల్ల, నీరసం, రక్తహీనత సమస్యలు ఉన్నవారిలో.. ఆయాసం వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి.

1. ఆయాసం ఉన్నవారు చల్లని పదార్థాలు, కూల్‌ డ్రింక్స్‌, ఐస్‌ క్రీమ్‌లు, బెండకాయ, చేమ దుంప, పెరుగు, కొబ్బరి, చేప, సొరకాయ, దుంపకూరలు, బచ్చలి కూర, పుల్లని పదార్థాలను తీసుకోరాదు.

2. ముల్లంగి, వెలగ పండు, వేడినీళ్లు, తేనె, వెల్లుల్లి, గోధుమలతో చేసిన పదార్థాలను తీసుకోవాలి.

3. వామును 50 గ్రాముల మోతాదులో తీసుకుని పెనంపై వేయించాలి. తరువాత దాన్ని పలుచని వస్త్రంలో చుట్టి దాంతో వీపు, పక్క భాగాల్లో కాపడం పెట్టాలి. దీంతో ఊపిరితిత్తుల్లో ఉండే శ్లేష్మం కరుగుతుంది. ఆయాసం తగ్గుతుంది.

3. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రెండు చిటికెల పసుపు, ఒక చిటికె మెత్తని ఉప్పు, రెండు చిటికెల పిప్పళ్ల చూర్ణం తిని వేడినీళ్లు తాగడం మంచిది. దీంతో అలర్జీలు, ఆయాసం తగ్గుతాయి.

4. పిప్పళ్లు, మిరియాలు, పసుపు, ద్రాక్ష పండ్లు, నువ్వులు, బెల్లంలను సమాన భాగాల్లో తీసుకుని నూరి కుంకుడు గింజంత మాత్రలు చేసుకుని ప్రతి రోజూ ఉదయం పూట తీసుకుంటుంటే ఆయాసం తగ్గుతుంది.

5. ఉసిరిక పెచ్చులు, వరి పేలాలు, పటిక బెల్లం, నువ్వులు, నెయ్యిలను సమాన భాగాల్లో తీసుకుని మర్దించి చిన్న చిన్న మాత్రలుగా చేసుకుని ఉదయం, సాయంత్రం తీసుకుంటే ఆయాసం తగ్గుతుంది.

6. వేప నూనె 5 నుంచి 10 చుక్కలు ఒక తమలపాకుపై వేసుకుని నిత్యం తింటుంటే క్రమంగా ఆయాసం తగ్గుతుంది.

7. వేడి టీ డికాషన్‌లో 9 చుక్కల నిమ్మరసం వేసి తేనె కలుపుకుని వేడి వేడిగా తాగడం వల్ల ఆయాసం తగ్గుతుంది.

8. వాసారిష్ట 3 టీస్పూన్లు, కనకాసవం 3 టీస్పూన్లు కలుపుకుని మూడు టీస్పూన్ల నీళ్లు కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే ఆయాసం తగ్గుతుంది. శ్వాస సరిగ్గా ఆడుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts