ప్రపంచంలో దాదాపుగా అందరూ వాడే కూరగాయల్లో పచ్చి మిరప కాయలు ఒకటి. వీటిల్లో పచ్చివి, ఎండువి, పొడి ఇలా అనేక రూపాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 400 రకాల మిరపకాయల జాతులున్నాయి. కొన్నింటిలో కారం తక్కువగా కొన్నింటిలో ఎక్కువగా ఉంటుంది. మిరపకాయను చిన్నగా కొరికినా సరే నోరు మండుతుంది. దీని స్వభావమే అంత. అయితే మిరపకాయను కొరికిన తరువాత వచ్చే మంట తగ్గేందుకు కొంత సమయం పడుతుంది. కానీ నిజానికి మిరప పదార్థాలకు రుచిని ఇస్తుంది.
కూరలు, పచ్చళ్లు, ఊరగాయలు.. ఇలా ఏది తయారు చేయాలన్నా మిరపకాయలు కావాలి. మిరపకాయల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వీటి వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
1. మిరపలోని మండించే గుణం ఇతర నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇవ్వగలదని పరిశోధనలు పేర్కొంటున్నాయి. మిరపకాయను కొరకడం వల్ల గొంతులో, నాలుకలో ఉండే నొప్పి అందుకునే కారకాల్ని ఉద్దీప్తం చేస్తుంది. మంటకు కారణమయ్యే మిరపలోని కాప్సెయిసిన్ అనే పదార్థం వల్ల ఇది సాధ్యపడుతుంది. ఈ కారకాలు మెదడుకు సందేశాన్ని పంపిస్తాయి. శరీరంలోని సహజ పెయిన్ కిల్లర్స్ అయిన ఎండార్ఫిన్లను మెదడు విడుదల చేస్తుంది. ఈ కారణంగా నొప్పి నుంచి ఉపశమనం కలిగించే మందుల్లో ముఖ్యంగా ఆర్థరైటిస్‌కు సూచించే మందుల్లో మిరపకాయలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
2. మిరపకాయల్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే ఆహారం తీసుకున్న తరువాత చక్కెర స్థాయిల్ని 60 శాతానికి నియంత్రించడానికి శారీరక ఇన్సులిన్ అవసరాన్ని తగ్గిస్తాయి. ఇది డయాబెటిస్ ఉన్న వారికి, స్థూలకాయులకు ఉపయోగంగా ఉంటుంది.
3. మిరపలోని క్యాప్సెయిసిన్ ప్రోస్టేట్ క్యాన్సర్ విస్తరించకుండా కాపాడుతుంది. మిరపకాయలు ముఖ్యంగా ఎర్రని వాటిలో మంచి స్థాయిలో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించడానికి, క్యాన్సర్ నుంచి కాపాడడానికి దోహదం చేస్తాయి.
4. ముక్కు దిబ్బడ ఉన్నవారు మిరపకాయలు కలిసిన పదార్థాలను తినడం వల్ల ముక్కు క్లియర్ అవుతుంది. క్యాప్సెయిసిన్ ముక్కు నుంచి ద్రవాలు ఊరడానికి కారణమై ముక్కు దిబ్బడను నియంత్రించి ఫ్రీ నాసల్ పాసేజ్‌కు అవకాశం కల్పిస్తుంది.
5. మిరపకాయల్లోని బ్లడ్ థిన్నింగ్ గుణాలు రక్త ప్రసరణను మెరుగు పరిచి స్ట్రోక్ అవకాశాల్ని తగ్గిస్తాయి. రక్తనాళాలకు హాని కలిగించి, గుండె జబ్బుల అవకాశాన్ని పెంచే హోమోసిస్టెయిన్ స్థాయిలను మిరపలోని విటమిన్ బి తగ్గిస్తుదంఇ. అంటే ఈ మిరపకాయలోని మంట గుండెకు మేలు చేస్తుందన్నమాట.
6. మిరపకాయల్లో ఉండే క్యాప్సెయిసిన్ వేడిని ఉత్పత్తి చేసే పదార్థం. ఇది వేడిని ఉత్పత్తి చేయడం ద్వారా మూడు గంటల్లో జీవక్రియను 23 శాతం పెంచుతుంది. పెరిగిన జీవక్రియ మరింత కొవ్వును కరిగించడంలో సహాయ పడుతుంది.
7. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయగల సూపర్ ఫుడ్స్ జాబితాలో మిరపకాయలు ఉన్నాయి. వీటిలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది విటమిన్ ఎ గా మారుతుంది. సహజసిద్ధమైన ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. మిరపకాయల్లో ఉండే విటమిన్ సి కూడా రోగ నిరోధక వ్యవస్థకు మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365