భారతీయులు ఎంతో కాలం నుంచి ఆలుగడ్డలను వంటల్లో ఉపయోగిస్తున్నారు. ప్రతి ఇంట్లోని కిచెన్‌లోనూ మనకు ఇవి కనిపిస్తాయి. వీటిని కొందరు బంగాళాదుంపలు అని కూడా పిలుస్తారు. అయితే ఎలా పిలిచినప్పటికీ వీటిని వండి తింటే భలే రుచిగా కూరలు ఉంటాయి. అయితే బంగాళాదుంపల జ్యూస్‌తో చర్మ సమస్యలను నయం చేసుకోవచ్చు. వీటిల్లో పొటాషియం, బి విటమిన్లు, మాంగనీస్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అలాగే చర్మంపై ఉండే మచ్చలను తొలగిస్తాయి. డల్ స్కిన్ ఉండే వారు ఆలుగడ్డల జ్యూస్‌ను వాడితే మంచిది.
* ఆలుగడ్డలను పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీలో వేసి జ్యూస్‌లా పట్టుకోవాలి. అనంతరం అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నుంచి 20 నిమిషాలు ఆగాక కడిగేయాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. రోజూ ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే డల్ స్కిన్ కాస్తా కాంతివంతంగా మారుతుంది.
* బంగాళా దుంపల జ్యూస్‌ను కొద్దిగా తీసుకుని అందులో నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై ఉన్న డార్క్ ప్యాచ్‌లపై రాయాలి. ఇలా తరచూ చేస్తే డార్క్ ప్యాచ్‌లు పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖానికి సహజసిద్ధమైన కాంతి లభిస్తుంది.
* ఆలుగడ్డల జ్యూస్, బియ్యం పిండి, రోజ్ వాటర్, నిమ్మరసం, తేనెలను కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాలు ఆగాక చల్లని నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. డ్రై స్కిన్ ఉన్నవారు తేనెను ఉపయోగించాలి. సాధారణ స్కిన్ అయితే తేనె అవసరం లేదు.
* 5 స్పూన్ల ఆలుగడ్డ జ్యూస్, ఒక స్పూన్ బేకింగ్ సోడాను కలిపి అందులో సరిపడేంత నీటిని పోసి మళ్లీ కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొద్ది సేపు ఆగాక కడిగేయాలి. దీంతో ముఖంపై ఉండే పోర్స్ శుభ్రమవుతాయి.
* బంగాళా దుంపల జ్యూస్, కీర దోస జ్యూస్‌లను సమభాగాల్లో తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ల కింద వలయాకారంలో రాయాలి. అనంతరం 15 నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. కళ్లు వాపులకు గురయ్యే వారు కూడా ఈ చిట్కాను ప్రయత్నించవచ్చు.
* ఆలుగడ్డ జ్యూస్, లెమన్ జ్యూస్, ముల్తాని మిట్టిలను కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని చర్మానికి రాయాలి. తరువాత కొంత సేపు ఆగి కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపై ఉండే మచ్చలు పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది.