Tella Juttu : ఈ ఆకుల పసరును తెల్ల జుట్టుపై రాస్తే జీవితంలో తెల్ల జుట్టు రానే రాదు

Tella Juttu : తెల్ల జుట్టు స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. వ‌య‌స్సు త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ కొంద‌రికి జుట్టు తెల్ల‌గా అవుతుంటుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ ఇలా జుట్టు తెల్ల‌గా ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. న‌లుగురిలోనూ తిర‌గాల‌న్నా.. బ‌య‌ట‌కు వెళ్లాల‌న్నా.. ఇబ్బందిగా ఫీల‌వుతుంటారు. దీంతో మార్కెట్‌లో దొరికే ర‌క‌ర‌కాల హెయిర్ డైల‌ను ఉప‌యోగిస్తుంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. కానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. క‌నుక వీటికి బ‌దులుగా స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో త‌యారు చేసిన మిశ్ర‌మాన్ని వాడాలి. అప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే జుట్టును స‌హ‌జ‌సిద్ధంగా న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో బిళ్ల గ‌న్నేరు మొక్క‌లు పెరుగుతుంటాయి. ఇవి పింక్ లేదా తెలుపు రంగులో పూల‌ను పూస్తుంటాయి. అయితే పింక్ రంగులో ఉండే బిళ్ల గ‌న్నేరు మొక్క ఆకుల‌ను సేక‌రించాలి. ఇవి జుట్టును న‌ల్ల‌గా మారుస్తాయి. వీటిల్లో ఉండే ప‌లు బ‌యో యాక్టివ్ స‌మ్మేళనాలు జుట్టుపై ప్ర‌భావం చూపిస్తాయి. దీంతో తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. క‌నుక బిళ్ల గ‌న్నేరు మొక్క ఆకుల‌ను సేక‌రించి క‌డిగి శుభ్రం చేసి వాటి నుంచి ర‌సాన్ని తీయాలి. ఈ ర‌సాన్ని రెండు టీస్పూన్ల మోతాదులో తీసుకోవాలి.

apply this leaves juice on Tella Juttu to turn into Nalla Juttu
Tella Juttu

ఇక బిళ్ల గ‌న్నేరు మొక్క ఆకుల ర‌సం తీశాక‌.. అందులో ఒక నిమ్మ‌కాయ నుంచి ర‌సాన్ని పూర్తిగా తీసి క‌ల‌పాలి. ఆ త‌రువాత ఆ మిశ్ర‌మంలోనే ఒక టీస్పూన్ కొబ్బ‌రినూనెను క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని బాగా క‌లిపిన త‌రువాత జుట్టు కుదుళ్ల‌కు ప‌ట్టేలా మ‌ర్ద‌నా చేయాలి. 5 నిమిషాల పాటు ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు రాయాలి. త‌రువాత ఒక గంట పాటు అలాగే ఉండాలి. అనంత‌రం త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారంలో క‌నీసం రెండు సార్లు చేయాలి. దీంతో తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. అలాగే ఇత‌ర జుట్టు స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి.

బిళ్ల గ‌న్నేర మొక్క ఆకుల్లో ఉండే స‌మ్మేళ‌నాలు తెల్ల జుట్టును న‌ల్ల‌గా మారుస్తాయి. అలాగే నిమ్మ‌ర‌సంలో ఉండే పోష‌కాలు చుండ్రును తొల‌గిస్తాయి. జుట్టు కుదుళ్ల‌ను శుభ్రం చేస్తాయి. ఇక కొబ్బ‌రినూనె జుట్టుకు పోష‌ణ‌ను అందిస్తుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. దృఢంగా, ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది. క‌నుక వీటి మిశ్ర‌మాన్ని వాడితే అన్ని ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌కు ఒకేసారి చెక్ పెట్ట‌వ‌చ్చు. ముఖ్యంగా తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. క‌నుక దీన్ని త‌ర‌చూ ఉప‌యోగించాలి.

Share
Editor

Recent Posts