Beauty Tips : మన చర్మ ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగపరిచే విటమిన్ లలో విటమిన్ ఇ ఒకటి. విటమిన్ క్యాప్సుల్స్ లేదా విటమిన్ ఇ ఆయిల్ చర్మానికి చేసే మేలు గురించి తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. సౌందర్య నిపుణులు విటమిన్ ఇ పై చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడైయ్యాయి. దీనిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని పునర్జీవింపజేస్తాయి. చర్మానే కాకుండా జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా విటమిన్ ఇ మనకు ఎంతగానో సహాయపడుతుంది. మనం వాడే ప్రతి బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా విటమిన్ ఇ ప్రధానంగా ఉంటుంది. మనకు ప్రతి మెడికల్ స్టోర్స్ లో కూడా ఈ విటమిన్ ఇ క్యాప్సుల్స్ సులభంగా దొరుకుతాయి. మన చర్మానికి విటమిన్ ఇ చేసే లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ ఇ చర్మానికి మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది. పొడి చర్మం, పగుళ్లతో బాధపడే వారు విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను వాడడం వల్ల పగుళ్లు తగ్గి చర్మం తేమగా మారుతుంది. ఒక గిన్నెలో రెండు విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను తీసుకోవాలి. తరువాత అందులో రెండు టీ స్పూన్ల ఆలివ్ నూనెను కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు చర్మానికి రాసుకుని పడుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పగుళ్లు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే ముఖం పై వచ్చే ముడతలను కూడా విటమిన్ ఇ తొలగిస్తుంది. చాలా మందికి ముఖం పై ముడతలు వచ్చి చర్మం సాగీనట్టు ఉంటుంది. అలాంటి వారు విటమిన్ ఇ నూనెతో చర్మానికి మర్దనా చేయాలి.
తరువాత గోరు వెచ్చని నీటితో కడిగివేయాలి. ఇలా రోజులో రెండు నుండి మూడు సార్లు చేయడం వల్ల ముడతలు తగ్గి వృద్ధాప్య ఛాయలు మాయమవుతాయి. ఒక గిన్నెలో విటమిన్ ఇ నూనెతీసుకోవాలి. తరువాత అందులో కొద్దిగా ఆముదం నూనెను వేసి కలపాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి దానితో ముఖాన్ని తుడుచుకోవాలి. పది నిమిషాల తరువాత నీటితో కడిగివేయాలి. తరువాత అదే నూనెతో మర్దనా చేసుకుని పడుకోవాలి. మేకప్ వేసుకున్నప్పుడు, కాలుష్యంలో బయటికి వెళ్లివచ్చినప్పుడు ఈవిధంగా చేయడం వల్ల చర్మం ఉండే దుమ్ము, ధూళి, ఇతర వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. ఇలా రోజూ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
చర్మం సాగడం వల్ల వచ్చే చారలను కూడా విటమిన్ ఇ దూరం చేస్తుంది. విటమిన్ ఇ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మానికి నష్టం జరగకుండా కాపాడతాయి. అధికంగా బరువు పెరగడం, బరువు తగ్గడం, గర్భధారణ సమయంలోనే చర్మంపై చారలు రావడం జరుగుతుంది. ఒక నిమ్మకాయ రసానికి ఐదు విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చారలపై రాస్తూ మూడు నుండి ఐదు నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఇలా చేసిన 30 నిమిషాల తరువాత కడిగివేయాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల చర్మం పై ఉండే చారలు తొలగిపోతాయి. ఈ విధంగా విటమిన్ ఇ క్యాప్సుల్స్, విటమిన్ ఇ నూనె మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల చక్కటి ముఖ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.