Idli : రోజూ ఉదయం చాలా మంది రకరకాల బ్రేక్‌ఫాస్ట్‌లు చేస్తుంటారు. ఇడ్లీలు, దోశెలు, పూరీలు, ఉప్మా.. ఇలా ఎవరైనా సరే తమ ఇష్టానికి అనుగుణంగా ఆయా అల్పాహారాలను తీసుకుంటుంటారు. అయితే ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్‌ను ఇంకా ఆరోగ్యవంతంగా మార్చుకుంటే దాంతో అధిక బరువును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే..
రోజూ చాలా మంది ఇడ్లీలను ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లో తింటుంటారు. అయితే ఇడ్లీ పిండిలో కొద్దిగా ఓట్స్ పిండి కలిపి ఓట్స్ ఇడ్లీలను తయారు చేసుకోవాలి. ఈ క్రమంలో ఆ ఓట్స్ ఇడ్లీలను తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో ఓట్స్ ఇడ్లీలను తింటే అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ ఇడ్లీలు ఎంతగానో ఉపయోగపడతాయి.
2. ఓట్స్ మన గుండెకు ఎంతగానో మేలు చేస్తాయి. ఓట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను సంరక్షిస్తాయి. గుండె జబ్బులు ఉన్నవారు రోజూ ఓట్స్ ఇడ్లీలను తింటే మేలు జరుగుతుంది.
3. ఓట్స్‌లో అనేక పోషకాలు ఉంటాయి. అవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు ఇడ్లీలను నేరుగా తినలేకపోతే ఓట్స్ ఇడ్లీల రూపంలో తినవచ్చు. దీంతో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
4. కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవారు కూడా ఓట్స్ ఇడ్లీలను తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
5. చిన్నారులకు ఓట్స్ ఎంతగానో మేలు చేస్తాయి. వారిలో ఆస్తమా రాకుండా చూస్తాయి. మలబద్దకం ఉన్నవారికి ఓట్స్ ఇడ్లీలను తింటే మేలు జరుగుతుంది. ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
6. ఓట్స్‌ను తినడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మం బాగా పగులుతున్న వారు ఓట్స్ ఇడ్లీలను తరచూ తినవచ్చు. దీంతో చర్మాన్ని రక్షించుకోవచ్చు.
ఓట్స్‌ను పిండిలా చేసి ఇడ్లీ పిండిలో కలిపి దాంతో ఇడ్లీలు తయారు చేసుకుని తినవచ్చు. లేదా పాలలో కొద్దిగా ఓట్స్ కలిపి కొంచెం తేనే, పండ్ల ముక్కలు వేసి తినవచ్చు. రోజూ ఉదయం ఇలా బ్రేక్ ఫాస్ట్ చేస్తే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.