Bitter Gourd For Beauty : కాక‌ర‌కాయ ఆరోగ్యాన్నే కాదు.. అందాన్ని కూడా అందిస్తుంది.. ఎలాగంటే..?

Bitter Gourd For Beauty : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో కాక‌ర‌కాయ‌లు కూడా ఒక‌టి. కాకర‌కాయ‌లతో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను, వేపుళ్ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. కాక‌ర‌కాయ‌తో చేసిన వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. కాక‌ర‌కాయ‌ల‌తో ఎన్నో ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు, పోష‌కాలు దాగి ఉన్నాయి. మ‌న‌లో చాలా మంది కాక‌ర‌కాయ‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే కాక‌ర‌కాయ‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర ఆరోగ్యానికే కాదు మ‌న చ‌ర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. చ‌ర్మ ఆరోగ్యానికి కాక‌ర‌కాయ ఎలా మేలు చేస్తుంద‌ని మ‌న‌లో చాలా మంది సందేహిస్తూ ఉంటారు. కానీ కాక‌ర‌కాయ‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు.

మొటిమ‌ల‌ను, మ‌చ్చ‌ల‌ను త‌గ్గించి ముఖాన్ని అందంగా మార్చ‌డంలో కాక‌ర‌కాయ ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. కాక‌ర‌కాయ వ‌ల్ల మ‌న‌కు క‌లిగే సౌంద‌ర్య ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొటిమ‌ల‌ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కాక‌ర‌కాయ‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. మ‌న ముఖానికి త‌గినంత కాక‌ర‌కాయ జ్యూస్ ను ఒక గిన్నెలో తీసుకోవాలి. త‌రువాత ఇందులో క‌రివేపాకు పొడి వేసి కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి ఆరిన త‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా త‌ర‌చూ చేస్తూ ఉండ‌డం వ‌ల్ల మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గుతుంది. అలాగే ముఖంపై ఉండే న‌ల్ల‌టి మ‌చ్చ‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా కాక‌ర‌కాయ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. కాక‌రకాయ జ్యూస్ ను ముఖానికి ప‌ట్టించి ఆరిన త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

Bitter Gourd For Beauty how to use this works effectively
Bitter Gourd For Beauty

ఇలా త‌ర‌చూ చేస్తూ ఉండ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉండే న‌ల్ల‌టి మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి. అలాగే కాక‌ర‌కాయ‌తో మ‌నం ఫేస్ ప్యాక్ ను కూడా వేసుకోవ‌చ్చు. చిన్న కాక‌ర‌కాయ‌ను తీసుకుని ముక్క‌లుగా చేసి జార్ లో వేసుకోవాలి. త‌రువాత దీనిని మెత్త‌ని పేస్ట్ లాగా చేసి గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పేస్ట్ లో జాజికాయ పొడి, పెరుగు వేసి క‌ల‌పాలి. త‌రువాత మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి. ఆరిన త‌రువాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా త‌రుచూ చేస్తూ ఉండ‌డం వ‌ల్ల ముఖం అందంగా క‌న‌బ‌డుతుంది. అలాగే మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ఈ విధంగా కాక‌ర‌కాయ మ‌న చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. కాక‌ర‌కాయ‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి చ‌ర్మ సౌంద‌ర్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు.

D

Recent Posts