Black Heads Home Remedies : మనలో చాలా మంది బ్లాక్ హెడ్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ముక్కు, బుగ్గలు, నుదురు భాగాల్లో వస్తూ ఉంటాయి. ఇవి ముక్కుపై నల్లటి మచ్చలుగా ఏర్పడతాయి. బ్లాక్ హెడ్స్ వల్ల ఎటువంటి నష్టం లేనప్పటికి వీటి కారణంగా ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. చర్మానికి ఎండ ఎక్కువగా తగలడం వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య తలెత్తుతుంది. చర్మ కణజాలంలో ఉండే మొలనోసైట్స్ ఎండ కారణంగా ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతాయి. దీంతో అవి నలుపును ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. ముక్కు మీద చర్మం మరీ పలుచగా, సున్నితంగా ఉంటుంది. కనుక బ్లాక్ హెడ్స్ ముక్కు మీద ఎక్కువగా వస్తూ ఉంటాయి.
ఇలా బ్లాక్ హెడ్స్ సమస్యతో బాధపడే వారు ముఖ్యంగా ముఖానికి ఎండ తగలకుండా చూసుకోవాలి. ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు ముఖానికి ఎండ తగలకుండా టోపిని ధరించాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఎండ పడకుండా ఉంటుంది. దీంతో మొలనోసైట్స్ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయడం తగ్గిస్తాయి. అలాగే ఎండలో ఎక్కువగా తిరగాల్సి వచ్చినప్పుడు ముక్కు భాగంలో కొబ్బరి నూనెను రాసుకుని వెళ్లాలి. ఎండ నుండి చర్మం దెబ్బతినకుండా కాపాడడంలో నూనె మనకు సహాయపడుతుంది. అలాగే బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో తేనె కూడా మనకు సహాయపడుతుంది. రోజూ తేనెను ముక్కు మీద రాసి 5 నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. దీనిని అరగంట పాటు ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొలనోసైట్స్ నలుపు వర్ణం ఎక్కువగా ఉత్పత్తి చేయకుండా ఉంటాయి. దీనితో పాటు మడ్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
ముల్తానీ మట్టి లేదా నల్ల మట్టిని తీసుకుని నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల మట్టి చల్లగా అవుతుంది. మట్టి చల్లగా అయిన తరువాత దీనిని తీసుకుని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాసుకోవాలి. దీనిని అరగంట పాటు ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. రోజుకు ఒకసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మడ్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఆ భాగాలకు ఆక్సిజన్, నీరు, పోషకాలు చక్కగా అందుతాయి. అలాగే ఆ భాగంలో ఉండే వ్యర్థాలు తొలగిపోతాయి. వీటితో పాటు నిమ్మజాతికి చెందిన పండ్ల రసాలను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల చర్మ కణజాలం మెరుగుపడుతుంది. దీంతో ముక్కు వచ్చే నల్లటి మచ్చలు, బ్లాక్ హెడ్స్, బ్లాక్ స్పాట్స్ వంటివి తగ్గుతాయి. అదే విధంగా నీటిని కూడా ఎక్కువగా తాగాలి. నీటిని తాగడం వల్ల వ్యర్థాలు తొలగిపోతాయి. బ్లాక్ హెడ్స్ సమస్య తొలగిపోతుంది. బ్లాక్ హెడ్స్ సమస్యతో బాదపడే వారు ఈ చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.