Black Heads : ముఖం అందంగా కనబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది అనేక చర్మ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. మనల్ని వేధించే చర్మ సంబంధిత సమస్యల్లో బ్లాక్ హెడ్స్ సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ముక్కుపై వస్తూ ఉంటాయి. వీటి వల్ల ఎటువంటి సమస్య లేనప్పటికి చూడడానికి అందవిహీనంగా కనబడతాయి. ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల చర్మం పై ఉండే మలినాలు, మృత కణాలు చర్మం పై ఉండే జిడ్డుతో కలిసి బ్లాక్ హెడ్స్ గా మారతాయి. జిడ్డు చర్మం ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వీటిని తొలగించడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ బ్లాక్ హెడ్స్ ను మన వంటింట్లో ఉండే పదార్థాలతో చాలా సులభంగా తొలగించుకోవచ్చు. బ్లాక్ హెడ్స్ ను తొలగించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో పంచదార మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ పంచదారను వేసి అందులో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను వేయాలి. తరువాత ఈ పంచదారను చేత్తో తీసుకుంటూ బ్లాక్ హెడ్స్ పై 10 నిమిషాల పాటు రుద్దాలి.తరువాత దీనిని వస్త్రంతో తుడిచి శుభ్రం చేయాలి. ఇలా శుభ్రం చేసిన తరువాత వేడి నీటితో ముఖానికి ఆవిరి పట్టుకోవాలి. ఆవిరి పట్టడం బ్లాక్ హెడ్స్ మెత్తబడి వదులవుతాయి. ఇప్పుడు దూదిని తీసుకుని బ్లాక్ హెడ్స్ ను శుభ్రం చేసుకోవాలి. తరువాత ఆ భాగంలో మీగడను లేదా మాయిశ్చరైజర్ ను రాయాలి. ఇలా చేయడం వల్ల చాలా సులభంగా బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు. అలాగే మన వంటగదిలో ఉండే జాజికాయతో కూడా మనం బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు.
జాజికాయను నీటితో కలిపి మెత్తగా నూరాలి. తరువాత ఈ మిశ్రమానికి తేనెను కలిపి బ్లాక్ హెడ్స్ ను ఉన్న చోట అలాగే ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి.ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా జాజికాయను పొడిగా చేయాలి. ఈ పొడికి పాల మీగడను కలిపి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను బ్లాక్ హెడ్స్ పై అలాగే ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తరువాత నీటితో కడిగి వేయాలి. ఈ విధంగా జాజికాయను తరచూ ఉపయోగించడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోవడంతో పాటు చర్మం మృదువుగా , సున్నితంగా తయారవుతుంది. ఈ చిట్కాలను పాటిస్తూనే తరచూ ముఖాన్ని జిడ్డు లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య నుండి బయటపడవచ్చు.