Dark Circles : రోజూ రాత్రి ఇలా చేస్తే చాలు.. క‌ళ్ల కింద న‌లుపు అస‌లు ఉండ‌దు..!

Dark Circles : మ‌న‌లో చాలా మందికి ముఖం తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి కంటి చుట్టూ న‌ల్ల‌టి వ‌ల‌యాలు ఏర్ప‌డ‌తాయి. కంటి చుట్టూ ఈ న‌ల్ల‌టి వ‌ల‌యాల వ‌ల్ల చాలా మంది అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. కంటి చుట్టూ న‌ల్ల‌టి వ‌లయాలు ఏర్ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ముఖ్యంగా వ‌య‌సు మీద ప‌డ‌డం చ‌ర్మంలో ఎలాసిటి త‌గ్గ‌డం వ‌ల్ల కంటి చుట్టూ వ‌ల‌యాలు ఏర్ప‌డ‌తాయి. అలాగే ఎక్కువ‌గా టివి, కంప్యూట‌ర్, సెల్ ఫోన్ వంటి వాటిని చూడ‌డం, ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, అలాగే శ‌రీరం డీ హైడ్రేష‌న్ కు గురి అవ్వ‌డం, నిద్ర‌లేమి వంటి కార‌ణాల వ‌ల్ల కూడా క‌ళ్ల చుట్టూ న‌ల్ల‌టి వ‌ల‌యాలు వ‌స్తూ ఉంటాయి. కొంద‌రిలో జెన‌టిక్స్ కార‌ణంగా కూడా క‌ళ్ల చుట్టూ న‌ల్ల‌టి వ‌ల‌యాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

క‌ళ్ల చుట్టూ న‌ల్ల‌టి వ‌ల‌యాలు రావ‌డం వ‌ల్ల ఎటువంటి నష్టం లేన‌ప్ప‌టికి వీటి వ‌ల్ల ముఖం అందవిహీనంగా మారుతుంది. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది అనేక ర‌కాల క్రీముల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి ఫ‌లితం ఉండ‌దు. మ‌న ఇంట్లోనే ఒక చ‌క్క‌టి చిట్కాను త‌యారు చేసుకుని వాడడం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా క‌ళ్ల చుట్టూ న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను తొలగించుకోవ‌చ్చు. కంటి చుట్టూ న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను తొల‌గించే ఆ చిట్కా ఏమిటి…అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఒక టీ స్పూన్ ఆలివ్ నూనెను, ఒక టీ స్పూన్ అలోవెరా జెల్ ను, ఒక విట‌మిన్ ఇ క్యాప్సుల్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఆలివ్ ఆయిల్ ను వేయాలి.

Dark Circles apply this mixture daily at night
Dark Circles

త‌రువాత ఇందులో అలోవెరా జెల్ ను వేసి క‌ల‌పాలి. త‌రువాత క్యాప్సుల్ లో ఉండే విట‌మిన్ ఇ ఆయిల్ ను వేసి క‌ల‌పాలి. ఇలా తయారు చేసుకున్న మివ్ర‌మాన్ని రాత్రి ప‌డుకునే ముందు క‌ళ్ల చుట్టూ రాసుకుని సున్నితంగా మ‌ర్ద‌నా చేసుకోవాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచుకుని ఉద‌యాన్నే శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్ల చుట్టూ ఉండే న‌ల్ల‌టి వ‌ల‌యాలు తొల‌గిపోతాయి. దీనిని క్ర‌మం త‌ప్ప‌కుండా వాడ‌డం వ‌ల్ల వారం రోజుల్లోనే క‌ళ్ల చుట్టూ న‌ల్ల‌టి వ‌ల‌యాలు తొల‌గిపోతాయి. క‌ళ్ల చుట్టూ మరీ న‌ల్ల‌గా ఉన్న వారు ఈ చిట్కాను మ‌రి కొద్ది రోజులు క్ర‌మం త‌ప్ప‌కుండా వాడాల్సి వ‌స్తుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వల్ల క‌ళ్ల చుట్టూ ఉండే న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను చాలా సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు.

D

Recent Posts