Dark Circles Home Remedies : క‌ళ్ల కింద న‌లుపును పూర్తిగా పోగొట్టే చిట్కాలు.. ఇలా చేయండి చాలు..!

Dark Circles Home Remedies : మ‌న‌లో చాలా మందికి క‌ళ్ల చుట్టూ న‌ల్ల‌గా ఉంటుంది. క‌ళ్ల చుట్టూ న‌ల్ల‌టి మ‌చ్చ‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి. దీంతో ముఖం అంత‌గా ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌దు. మ‌న‌లో చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వాటిలో ఎండలో తిర‌గ‌డం కూడా ఒక‌టి. ఎండ‌లో తిర‌డగ‌డం వ‌ల్ల సూర్య కిర‌ణాల్లో ఉండే ఆల్ట్రావైలెట్ కిర‌ణాలు క‌ళ్ల మీద ప‌డ‌డం వ‌ల్ల ఆ భాగంలో మెల‌నోసైట్స్ స్టిమ్యూలేట్ అయ్యి మెల‌నిన్ ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తాయి. దీంతో క‌ళ్ల చుట్టూ న‌ల్ల‌గా మారిపోతుంది. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డాలంటే క‌ళ్ల మీద నేరుగా ఎండ ప‌డ‌కుండా చూసుకోవాలి. టోపీలు వంటి వాటిని ధ‌రించాలి. అలాగే కళ్ల చుట్టూ ఇన్ ప్లామేష‌న్ తగ్గ‌డానికి తేనెను రాసుకోవాలి.

స్వ‌చ్చ‌మైన తేనెను రాసి మ‌ర్దనా చేయ‌డం వ‌ల్ల తేనె చ‌ర్మంలోకి బాగా ఇంకుతుంది. దీంతో ఆ భాగంలో చ‌ర్మ క‌ణాల్లో వ‌చ్చిన ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. క‌ళ్‌ల చుట్టూ తేనెను రాసుకుని 10 నిమిషాల పాటు సున్నితంగా మ‌ర్దనా చేసుకోవాలి. దీనిని అర‌గంట పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల క‌ళ్ల చుట్టూ న‌లుపు తగ్గుతుంది. ఇలా తేనెను రాసుకున్న త‌రువాత న‌ల్ల‌టి సున్నిత‌మైన బంక‌మ‌ట్టిని తీసుకుని పేస్ట్ లాగా చేసుకుని క‌ళ్ల కింద రాసుకోవాలి. దీనిని అర‌గంట పాటు అలాగే ఉంచిన త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా మ‌డ్ ప్యాక్ ను వేసుకోవ‌డం వల్ల ఆ భాగానికి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ ఎక్కువ‌గా అవుతుంది. దీంతో ఆ భాగంలో నలుపు త‌గ్గ‌డానికి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే క‌ళ్ల‌ను గ‌ట్టిగా మూస్తూ తెరుస్తూ ఉండాలి.

Dark Circles Home Remedies very effective try these
Dark Circles Home Remedies

ఇలా రోజుకు 20 నుండి 30 సార్లు చేయ‌డం వల్ల కళ్ల‌కు చ‌క్క‌టి వ్యాయామం అవుతుంది. దీంతో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ పెరిగి కళ్ల చుట్టూ న‌లుపు త‌గ్గుతుంది. అలాగే అవ‌కాశం ఉన్న వారు ప‌గ‌టి పూట ఒక గంట పాటు ప‌డుకునే ప్ర‌యత్నం చేయాలి. ఇలా చేయ‌డం వల్ల క‌ళ్ల‌కు ఒత్తిడి త‌గ్గుతుంది. దీని వల్ల కూడా క‌ళ్ల కింద న‌లుపు త‌గ్గుతుంది. అలాగే ఉద‌యం పూట క్యారెట్ జ్యూస్ ను , సాయంత్రం స‌మ‌యంలో నారింజ , బ‌త్తాయి జ్యూస్ ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ ఎ, విట‌మిన్ సి అందుతుంది. దీంతో క‌ణాల్లో ఉండే ఇన్ ప్లామేష‌న్ త‌గ్గి న‌లుపు త‌గ్గుతుంది. ఇలా రెండు నెల‌ల పాటు చేయ‌డం వ‌ల్ల క‌ళ్ల ఉండే న‌లుపు త‌గ్గుతుంది. క‌ళ్ల చుట్టూ చ‌ర్మం తిరిగి సాధార‌ణ స్థితికి చేరుకుంటుంది.

D

Recent Posts