Facial At Home : బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు.. ఇంట్లోనే ఇలా ఫేషియ‌ల్ చేసుకోవ‌చ్చు..!

Facial At Home : అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. బ‌య‌ట ల‌భించే బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడ‌డంతో పాటు బ్యూటీ పార్ల‌ర్ ల‌కు వెళ్లి ఫేషియ‌ల్ వంటి వాటిని కూడా ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. అయితే ఇవి ఎంతో ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. బ్యూటీ పార్ల‌ర్ కు వెళ్లే ప‌ని లేకుండా మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లోనే ఫేషియ‌ల్ ను చేసుకోవ‌చ్చు. అలాగే ఇందుకు ఉప‌యోగించే ప‌దార్థాల్నీ కూడా మ‌న‌కు సుల‌భంగా ల‌భించేవే. ఇంట్లోనే ఫేషియ‌ల్ ను ఎలా చేసుకోవాలి.. వీటికి కావ‌ల్సిన వ‌స్తువులు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.

క్లెంజింగ్ : ఫేషియ‌ల్ లో మొద‌టి స్టెప్ క్లెంజింగ్. ముందుగా ముఖానికి కాస్తంత కొబ్బ‌రి నూనె రాసుకుని, అర నిమిషం పాటు మ‌ర్ద‌నా చేసుకోవాలి. ఆ త‌రువాత వేడి నీళ్ల‌లో ముంచిన క్లాత్ ను ముఖంపై పెట్టుకోవాలి. దీనిని రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత పొడి క్లాత్ తో ముఖాన్ని తుడుచుకోవాలి. స్టీమింగ్ : ముందుగా వేడి నీళ్ల‌ల్లో నిమ్మ‌గ‌డ్డి లేదా లావెండ‌ర్ ఆయిల్ వేయాలి. ఆ త‌రువాత ఈ నీటితో ముఖానికి ఆవిరి ప‌ట్టుకోవాలి. ఆవిరి బ‌య‌ట‌కు పోకుండా త‌ల మీద ఏదైనా ట‌వ‌ల్ క‌ప్పుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఆవిరి పట్టుకున్న త‌రువాత మెత్త‌టి క్లాత్ తో ముఖాన్ని సున్నితంగా తుడుచుకోవాలి.

Facial At Home very easy to make steps to follow
Facial At Home

ఎక్స్ ఫోలియేష‌న్ : దీనినే ఫేషియ‌ల్ స్క్ర‌బ్ అని కూడా అంటారు. ఈ స్క్ర‌బ్ కోసం ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఓట్స్, ఒక టీ స్పూన్ బాదం నూనె, ఒక టీ స్పూన్ రోజ్ వాట‌ర్ వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మంతో 2 నిమిషాల పాటు స్క్ర‌బ్‌ చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ : ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ శ‌న‌గ‌పిండి, ఒక టీ స్పూన్ ప‌సుపు, ఒక టీ స్పూన్ తేనె వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిలో కొద్దిగా రోజ్ వాట‌ర్ ను వేసి ప‌లుచ‌గా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

టోనింగ్ : ఇప్పుడు నిమ్మ‌ర‌సం లేదా రోజ్ వాట‌ర్ లో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే జిడ్డు పూర్తిగా తొల‌గిపోతుంది. మాయిశ్చ‌రైజ‌ర్ : జిడ్డు చ‌ర్మం ఉన్న వారు ఒక టేబుల్ స్పూన్ పాల‌లో పావు టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, అర టేబుల్ స్పూన్ నిమ్మ‌ర‌సం క‌లిపి ముఖం, మెడ భాగాల‌కు రాసుకోవాలి. త‌రువాత 10 నిమిషాల పాటు కింది నుండి పైకి మ‌ర్ద‌నా చేసుకోవాలి. అదే పొడి చ‌ర్మం ఉన్న వారు కొబ్బ‌రి నూనె లేదా ఆలివ్ ఆయిల్ రాసుకోవ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌నం ఇంట్లోనే చాలా సుల‌భంగా ఫేషియ‌ల్ ను చేసుకోవ‌చ్చు. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల చాలా త‌క్కువ ఖ‌ర్చులో మ‌నం మ‌న ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు.

D

Recent Posts