Facial Glow : ముఖాన్ని కాంతివంతంగా మార్చే చిట్కా.. బాగా ప‌నిచేస్తుంది..!

Facial Glow : ప్ర‌స్తుత కాలంలో వాతావ‌ర‌ణ కాలుష్యం, దుమ్ము, ధూళి, ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం వంటి కార‌ణాల చేత చ‌ర్మం త్వ‌ర‌గా పాడైపోవ‌డం, చ‌ర్మం న‌ల్ల‌గా మారడం వంటి వాటితో అనేక ఇత‌ర చ‌ర్మ స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంది. ఈ చ‌ర్మ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది ర‌సాయ‌నాలు క‌లిగిన సౌంద‌ర్య సాధ‌నాల‌ను వాడుతుంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు తగ్గ‌క‌పోగా మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. కొన్ని ర‌కాల ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి మ‌నం ముఖాన్ని అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా మార్చుకోవ‌చ్చు. స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించి ముఖాన్ని అందంగా మార్చే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం మ‌నం శ‌న‌గ‌పిండిని, పెరుగును, రోజ్ వాట‌ర్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది.

ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ శ‌న‌గ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత అందులో ఒక టీ స్పూన్ పెరుగును, ఒక టీ స్పూన్ రోజ్ వాట‌ర్ ను వేసి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని ఉండ‌లు లేకుండా గ‌డ్డ‌లు క‌ట్ట‌కుండా బాగా క‌లపాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు ప‌ట్టించాలి. ఆరిన త‌రువాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌తిరోజూ చేయ‌డం వ‌ల్ల ముఖం అందంగా మారుతుంది. అదేవిధంగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ పాల‌ను తీసుకోవాలి. త‌రువాత అందులో ఒక టీ స్పూన్ రోజ్ వాట‌ర్, 6 చుక్క‌ల నిమ్మ‌ర‌సాన్ని వేసి క‌లపాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు బాగా ప‌ట్టించి మ‌ర్ద‌నా చేయాలి.

Facial Glow follow this wonderful remedy very effective
Facial Glow

15 నిమిషాల నీటితో క‌డుక్కోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు త‌గ్గి ముఖం కాంతివంతంగా త‌యార‌వుతుంది. అదే విధంగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ శ‌న‌గ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత అందులో త‌గినంత రోజ్ వాట‌ర్ ను వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన త‌రువాత చ‌ల‌ల్టి నీటితో శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ముఖం పై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, వ్య‌ర్థ ప‌దార్థాలు, ఎండ వ‌ల్ల క‌లిగిన న‌లుపు తొల‌గిపోయి చ‌ర్మం అందంగా మారుతుంది. ఈ చిట్కాల‌ను పాటించ‌డంతో పాటు ప్ర‌తిరోజూ 4 నుండి 6 లీట‌ర్ల నీటిని తాగాలి. బ‌య‌టి ఆహారాన్ని, జంక్ ఫుడ్ ను తీసుకోవ‌డం మానేయాలి. బ‌య‌టికి వెళ్లి రాగానే ముఖాన్ని చ‌క్క‌గా శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చ‌ర్మం పై ఉండే న‌లుపు తొల‌గిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా, ఆరోగ్యంగా త‌యార‌వుతుంది.

D

Recent Posts