Hair Care : పొడవైన, దృఢమైన జుట్టు ఉండాలని అమ్మాయిలు అందరూ కోరుకుంటారు. ఈ క్రమంలోనే జుట్టు సంరక్షణ కోసం వారు అనేక చర్యలు చేపడుతుంటారు. మార్కెట్‌లో దొరికే అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను వాడుతుంటారు. జుట్టుకు అనేక క్రీములు, హెయిర్ ప్యాక్‌లు, ఆయిల్స్, షాంపూలను పెడుతుంటారు. దీంతో జుట్టును వారు బాగా రక్షించుకుంటారు. అయితే చాలా మంది ఈ రక్షణ చర్యలు చేపట్టినా కొన్ని పొరపాట్లను సైతం చేస్తుంటారు. దీంతో జుట్టు డల్‌గా మారి రాలిపోతుంది. జుట్టు బలహీనంగా కూడా మారుతుంది. ఈ క్రమంలోనే జుట్టు విషయంలో చాలా మంది చేసే ఆ పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టుకు నూనె రాసినా లేదా షాంపూ పెట్టినా చాలా మంది గట్టిగా వేగంగా రుద్దుతారు. ఇలా అసలు చేయకూడదు. దేన్ని జుట్టుకు అప్లై చేసినా కూడా జుట్టుకు సున్నితంగా మర్దనా చేయాలి. గట్టిగా రుద్దితే జుట్టు బలహీనంగా మారి రాలిపోతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే కొందరు తడి జుట్టును దువ్వుతుంటారు. తడి జుట్టు వాస్తవానికి బలహీనంగా ఉంటుంది. అలాంటి సమయంలో దువ్వితే జుట్టు రాలిపోయే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జుట్టు బాగా పొడిగా అయ్యాక మాత్రమే దువ్వాలి.
జుట్టు సంరక్షణ కోసం చాలా మంది స్టైలింగ్ లేదా హీటింగ్ టూల్స్ వాడుతారు. ఉదాహరణకు హెయిర్ డ్రయర్ లాంటివి. వీటిని ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు. కానీ రోజూ వాడితే మాత్రం జుట్టు బలహీనంగా మారుతుంది. కనుక ఈ టూల్స్‌కు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. అలాగే జుట్టును కొందరు టైట్‌గా కట్టి ఉంచుతారు. ఇలా చేసినా జుట్టుకు నష్టమే జరుగుతుంది. జుట్టును టైట్‌గా కట్టి ఉంచితే డ్యామేజ్ అవుతుంది. దీంతో జుట్టు రాలిపోతుంది. కనుక జుట్టును ఎల్లప్పుడూ లూజ్‌గా కట్టి ఉంచాలి. ఇలా ఈ జాగ్రత్తలను పాటిస్తే మీ జుట్టు పొడవుగా పెరుగుతుంది. దృఢంగా ఉంటుంది.