Green Brinjal Fry : వంకాయ ఫ్రై అనగానే చాలా మందికి నోట్లో నీళ్లూరతాయి. వంకాయ ఫ్రైని అందరూ ఇష్టంగానే తింటారు. అయితే వంకాయ రకాన్ని బట్టి చేసే ఫ్రై టేస్ట్ వేరేగా ఉంటుంది. ముఖ్యంగా సరిగ్గా చేయాలే కానీ ఆకుపచ్చ వంకాయ ఫ్రై టేస్ట్ అదిరిపోతుంది. దీన్ని అందరూ వండుతారు. కానీ కింద చెప్పిన విధంగా రెసిపిని ఫాలో అయి చేశారనుకోండి. ఎంతో అద్భుతంగా కూర వస్తుంది. ఇక వంకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకుపచ్చని వంకాయలు – పావు కిలో, నూనె – 50 ఎంఎల్, పచ్చి మిర్చి – 10 గ్రాములు, కరివేపాకు – 5 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 20 గ్రాములు, ఉప్పు – తగినంత, జీలకర్ర పొడి – 5 గ్రాములు, ఆవాలు – 2 గ్రాములు, పసుపు – చిటికెడు, కారం పొడి – 50 గ్రాములు, గరం మసాలా పొడి – 5 గ్రాములు, కొత్తిమీర – 2 గ్రాములు.
కడాయిలో నూనె వేసి వేగించాలి. జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. తరువాత పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఉప్పు, పసుపు వేసి వంకాయలను వేసి బాగా కలిపి 3 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించాలి. తరువాత కరివేపాకు, ఉప్పు, కారం పొడి, గరం మసాలా వేసి కలపాలి. 2 నిమిషాల పాటు ఉడికించిన తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించాలి.