Hair Tips : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది జుట్టు రాలడం అనే సమస్యతో బాధపడుతున్నారు. చిన్న వయస్సలోనే తెల్ల వెంటుక్రలు రావడాన్ని కూడా మనం గమనించవచ్చు. వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లల్లో మార్పులు వంటి వాటిని జుట్టు రాలడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ సమస్యలను మనం అధిగమించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఒత్తైన జుట్టును ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీని కోసం మనం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం. అయితే తక్కువ ఖర్చుతోనే పలు ఇంటి చిట్కాలను ఉపయోగించి చాలా సులువుగా మనం ఈ సమస్య నుండి బయట పడవచ్చు.
మనం తలకు రాసుకునే నూనెలో ఇతర పదార్థాలను చేర్చి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాకుండా, జుట్టు నిగారించడంతోపాటు తెల్ల జుట్టు నల్లగా కూడా మారుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించే ఈ పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలుఏమిటి, ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా దీనిని వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పేస్ట్ ను తయారు చేసుకోవడానికి ముందుగా నాలుగు టీ స్పూన్ల మెంతులను తీసుకోవాలి. కళాయిలో ఈ మెంతులను వేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. తరువాత ఈ మెంతులను జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో మెంతుల పొడి, రెండు టీ స్పూన్ల ఉసిరికాయ పొడి, నాలుగు టీ స్పూన్ల కొబ్బరి నూనె ను వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ను తలకు బాగా పట్టించి, ఒక గంట తరువాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయాలి.
ఇలా చేయడం వల్ల నెల రోజులల్లోనే మన జుట్టులో మార్పు రావడాన్ని మనం గమనించవచ్చు. ఇలా చేయడం వల్ల ఎటువంటి హెయిర్ డై లను వాడకుండానే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు వచ్చి జుట్టు ఒత్తుగా తయారవడమే కాకుండా జుట్టు నిగారింపును సొంతం చేసుకుంటుంది. ఈ పేస్ట్ తయారీలో కొబ్బరి నూనెకు బదులుగా ఆలివ్ నూనెను, ఆముదం నూనెను కూడా వాడవచ్చు. మెంతులు, ఉసిరికాయ పొడి సహజ సిద్దమైన హెయిర్ డై లా పని చేస్తాయి. వీటిలో ఉండే ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు సమస్యలు పోతాయి.