వర్షాకాలంలో మీ ముఖానికి పెరుగు ఒక వరం లాంటిది.. దాని ప్రయోజనాలను తెలుసుకోండి..

వాతావరణంతో సంబంధం లేకుండా చర్మ సమస్యలు రావడం సర్వసాధారణంగా జ‌రుగుతూనే ఉంటుంది. వర్షాకాలంలో చర్మానికి అదనపు జాగ్రత్త అవసరం అవుతుంది. వర్షాకాలంలో వ‌చ్చే చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకునేందుకు చ‌ర్మాన్ని సంరక్షించుకునేందుకు పెరుగు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. పెరుగుతో చ‌ర్మాన్ని ఏ విధంగా సంర‌క్షించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షాకాలంలో మీ ముఖానికి పెరుగు ఒక వరం లాంటిది.. దాని ప్రయోజనాలను తెలుసుకోండి..

పెరుగులో కాల్షియం, ప్రోటీన్లు, వివిధ ర‌కాల విట‌మిన్లు స‌మృద్ధిగా ఉంటాయి. అలాగే విట‌మిన్ డి ల‌బిస్తుంది. లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఈ పోషకాలు అన్నీ చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. చ‌ర్మంపై వ‌చ్చే ముడ‌త‌లు, మ‌చ్చ‌ల‌ను పోగొడ‌తాయి. అందువ‌ల్ల చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు పెరుగును ఉప‌యోగించ‌వ‌చ్చు.

శ‌న‌గ పిండి, పెరుగు క‌లిపిన మిశ్ర‌మాన్ని ఫేక్ ప్యాక్ లా ఉప‌యోగించ‌వ‌చ్చు. దీంతో చ‌ర్మంపై ఉండే మృత క‌ణాలు తొల‌గిపోయి చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. జిడ్డు చ‌ర్మం ఉన్న‌వారికి ఈ ఫేస్ మాస్క్ ఎంత‌గానో ప‌నిచేస్తుంది.

ఒక పాత్ర‌లో 2 టీస్పూన్లు పెరుగు, ఒక టీస్పూన్ శ‌న‌గ‌పిండిని క‌లిపి మిశ్ర‌మంగా చేయాలి. దాన్ని ఫేస్ మాస్క్ లా ముఖానికి రాయాలి. 10 నిమిషాల త‌రువాత క‌డిగేయాలి. దీంతో చ‌ర్మం సంర‌క్షించ‌బ‌డుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది. మొటిమ‌లు త‌గ్గుతాయి. చ‌ర్మానికి మెరుపు వ‌స్తుంది.

పెరుగులో నిమ్మ‌ర‌సం క‌లిపి కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. నిమ్మ‌ర‌సంలో ఉంటే విట‌మిన్ సి చ‌ర్మాన్ని సంరక్షిస్తుంది. చ‌ర్మాన్ని శుభ్రం చేస్తుంది. మెరిసేలా చేస్తుంది. ఇందుకు గాను ఒక పాత్ర‌లో కొద్దిగా పెరుగును తీసుకుని అందులో స‌గం నిమ్మ‌కాయ‌ను పిండాలి. త‌రువాత ఆ మిశ్ర‌మాన్ని బాగా క‌లిపి ఫేస్ మాస్క్‌లా చేసి ముఖానికి రాయాలి. 20 నిమిషాల త‌రువాత క‌డిగేయాలి. దీంతో చ‌ర్మం సంర‌క్షించ‌బ‌డుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. వృద్ధాప్య ఛాయ‌లు ద‌రిచేర‌వు. ఇలా పెరుగుతో ముఖాన్ని మెరిసేలా చేయ‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts