భారతీయుల్లో సంతాన లోపం సమస్య అనేది ప్రస్తుత తరుణంలో పెరిగిపోయింది. చాలా మంది సంతానం లేక బాధపడుతున్నారు. కొందరికి ఆలస్యంగా సంతానం కలుగుతోంది. అయితే అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. సంతానం లేకపోవడానికి దంపతులిద్దరిలో ఎవరో ఒకరు కారణం అవుతున్నారు. కానీ కింద తెలిపిన ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీ, పురుషుల్లో ఉండే సమస్యలు తొలగిపోతాయి. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
* శనగలను ఉడకబెట్టి కానీ, కూరల్లో గానీ వేసుకుని నిత్యం తింటుంటే మహిళల్లో అండాశయాల పనితీరు మెరుగు పడుతుంది. దీని వల్ల నెలసరి సరిగ్గా అవుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.
* దానిమ్మ పండ్లలో స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పని తీరుకు అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల మహిళల్లో గర్భాశయానికి రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో రుతుక్రమం సరిగ్గా జరుగుతుంది. ఈ క్రమంలో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. దానిమ్మ పండ్లను తినడం వల్ల పురుషుల్లో వీర్యం అధికంగా ఉత్పత్తి అవుతుంది. పురుషుల్లో ఉండే సమస్యలు కూడా పోతాయి. దీని వల్ల సంతానాన్ని త్వరగా పొందవచ్చు.
* ఆకుపచ్చగా ఉండే కూరగాయలు, ఆకుకూరలను ఎక్కువగా తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. ఆ పోషకాలు స్త్రీ, పురుషుల్లో ఉండే హార్మోన్ అసమతుల్యతలను తగ్గిస్తాయి. అలాగే మహిళల్లో ఫోలిక్ యాసిడ్, ఐరన్ లెవల్స్ ను పెంచుతాయి. దీంతో గర్భం దాల్చే అవకాశాలు మెరుగు పడతాయి. అలాగే పురుషుల్లో వీర్యం నాణ్యత పెరుగుతుంది.
* ఆలివ్ ఆయిల్‌లో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. దంపతులు నిత్యం తమ ఆహారంలో ఆలివ్ ఆయిల్‌ను తీసుకుంటే దాంతో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. దీని వల్ల శృంగార సమస్యలు ఉండవు. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.
* గుమ్మడి కాయ విత్తనాలను తింటుంటే ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. దీంతో రక్తం పెరుగుతుంది. శృంగారంలో యాక్టివ్‌గా పాల్గొంటారు. సంతానం త్వరగా కలుగుతుంది.
* బాదం పప్పులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్రత్యుత్పత్తి అవయవాలకు, హార్మోన్లకు మేలు చేస్తాయి.. బాదం పప్పును తింటుంటే ఆయా అవయవాలు మెరుగ్గా పనిచేస్తాయి. దీంతో పిల్లలు త్వరగా కలిగేందుకు అవకాశం ఉంటుంది.
* తినడానికి రుచిలో ఘాటుగా, కారంగా ఉన్నా మిరపకాయల వల్ల కూడా దంపతులకు మేలే జరుగుతుంది. వీటిని తినడం వల్ల ప్రత్యుత్పత్తి అవయవాల పనితీరు మెరుగు పడుతుంది.
* అరటి పండ్లను ఎక్కువగా తినడం వల్ల స్త్రీలలో రుతుక్రమ సమస్య తొలగిపోతుంది. పీరియడ్స్ సరిగ్గా వస్తాయి. దీంతో సంతాన లోపం సమస్య నుంచి బయట పడవచ్చు.