Hair Fall : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. స్త్రీలు, పురుషులు అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలుతుందంటే చాలు, ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే జుట్టు రాలే సమస్య ఉన్నవారు మెంతులతో ఒక చిట్కాను పాటిస్తే చాలు.. జుట్టు రాలడం తగ్గుతుంది. పైగా జుట్టు బాగా పెరుగుతుంది. దీంతోపాటు అన్ని శిరోజాల సమస్యలు తగ్గుతాయి. మరి ఆ చిట్కా ఏమిటంటే..
ఒక గిన్నె తీసుకుని అందులో నీరు పోసి అందులో రెండు టీస్పూన్ల మెంతులను వేయాలి. రాత్రంతా ఆ నీటిలో ఆ మెంతులను నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటికి ఇంకొంత నీరు కలిపి మరగబెట్టాలి. 10 నిమిషాల పాటు సన్నని మంటపై ఆ నీటిని మరిగించాక దించి వడకట్టాలి. అనంతరం వచ్చే మిశ్రమంలో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండాలి. తరువాత బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి.
అలా ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాక సుమారుగా 45 నిమిషాల పాటు ఉండి ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేయాలి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది. శిరోజాలు కాంతివంతంగా మారి ప్రకాశిస్తాయి. మెంతులతో జుట్టు సమస్యలను ఇలా తగ్గించుకోవచ్చు.