Pimples Home Remedies : వయసులో ఉన్న పిల్లలతో పాటు మనలో చాలా మంది మొటిమల సమస్యతో బాధపడుతూ ఉంటారు. మొటిమలతో పాటు వాటి కారణంగా వచ్చే మచ్చల కారణంగా ముఖం అంత అందంగా కనిపించదు. కొందరు ఈ సమస్య కారణంగా బయటకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య నుండి బయటపడడానికి అనేక రకాల క్రీములు, లోషన్ లు వాడుతూ ఉంటారు. అయినప్పటికి ఈ సమస్య నుండి బయటపడలేని వారు చాలా మంది ఉంటారు. ఇలా మొటిమల సమస్యతో అధికంగా బాధపడే వారు ఇప్పుడు చెప్పే విధంగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మొటిమల సమస్యతో బాధపడే వారు ఈ నియమాలను పాటించడం వల్ల మొటిమల సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. మొటిమలతో బాధపడే వారు రోజూ 4 లీటర్ల నీటిని తాగాలి. రోజూ రెండు సార్లు మలవిసర్జనకు వెళ్లాలి.
ఇలా చేయడం వల్ల మనలో ఉన్న వ్యర్థాలు, విష పదార్థాలన్నీ తొలగిపోతాయి. అలాగే ముఖానికి కొబ్బరి నూనె లేదా మీగడను రాసుకోవాలి. ఇలా రాసుకున్న తరువాత ముఖానికి ఫేస్ స్టీమర్ తో ఆవిరి పట్టుకోవాలి. ఇలా రోజూ ఆవిరి పట్టుకోవడం వల్ల ముఖ చర్మంపై మరియు చర్మం లోపలి పొరల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, మలినాలు, మృతకణాలు తొలగిపోతాయి. ఇలా ఆవిరి పట్టుకుని ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత ముఖానికి మడ్ ప్యాక్ ను వేసుకోవాలి. నల్ల మట్టిని తీసుకుని బాగా దంచి పొడిగా చేసుకోవాలి. తరువాత ఈ మట్టిని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టగా వచ్చిన మెత్తటి మట్టిలో నీళ్లు పోసి కలిపి నానబెట్టాలి. మట్టి చల్లగా అయిన తరువాత ఇందులో పసుపు కలిపి ముఖానికి రాసుకుని ఆరే వరకు ఉంచాలి. ఇలా చేయడం వల్ల మట్టిలో ఉండే చల్లదనం కారణంగా చర్మం కూడా చల్లగా మారిపోతుంది. చల్లబడిన చర్మాన్ని తిరిగి వెచ్చగా మార్చడానికి చర్మానికి రక్తప్రసరణ ఎక్కువగా జరుగుతుంది.
దీంతో చర్మకణాలకు కావల్సిన పోషణ అందడంతో పాటు మలినాలు కూడా తొలగిపోతాయి. ఇలా రోజూ చేయడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ఇలా రోజూ చేయడంతో పాటుగా రోజూ 2 రకాల జ్యూస్ లను తాగాలి. ఉదయం పూట కూరగాయల జ్యూస్ ను తీసుకోవాలి. అలాగే సాయంత్రం పండ్ల రసాలను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మచ్చలు తగ్గడంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇవన్నీ చేయడంతో పాటుగా చాలా మంది మొటిమలను గిల్లడం, పిండడం చేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. అలాగే మొటిమలపై సబ్బుతో లేదా బాడీ వాష్ తో గట్టిగా రుద్దవద్దు. మొటిమలు ఉన్న భాగంలో చేత్తో నెమ్మదిగా శుభ్రం చేసుకుని మెత్తటి వస్త్రంతో నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఈ నియమాలను పాటించడం వల్ల మొటిమల సమస్య తగ్గు ముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.