Pimples Home Remedies : మొటిమ‌లు, మచ్చ‌ల‌ను పోగొట్టే ఏకైక ఆయుధం ఇది.. ఇలా చేయాలి..!

Pimples Home Remedies : మ‌న‌లో చాలా మంది ముఖంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ముఖ్యంగా యువ‌త ఎక్కువ‌గా ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, జిడ్డు చ‌ర్మం, ర‌సాయనాలు క‌లిగిన లోష‌న్ ల‌ను, క్రీముల‌ను వాడ‌డం, మారిన ఆహార‌పు అల‌వాట్లు ఇలా అనేక కార‌ణాల చేత ముఖంపై మొటిమ‌లు వ‌స్తూ ఉంటాయి. మొటిమ‌లు వ‌చ్చిన చోట నొప్పి కూడా ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటుంది. చాలా మంది వీటి నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి అనేక ర‌కాల క్రీములు వాడుతూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి కొంద‌రిలో ఈ స‌మ‌స్య ఏ మాత్రం త‌గ్గు ముఖం ప‌ట్టదు. ఇలా ముఖంపై మొటిమ‌ల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఇప్పుడు చెప్పే వాటిని పాటించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

మొటిమ‌ల‌తో బాధ‌ప‌డే వారు చాలా మంది వీటిని గిల్లుతూ ఉంటారు. కానీ మొటిమ‌ల‌ను గిల్ల‌కూడ‌దు. మొటిమ‌ల‌ను గిల్ల‌డం వ‌ల్ల ఆ భాగంలో మ‌చ్చ‌లు, గుంత‌లు ఏర్ప‌డ‌తాయి. అలాగే మొటిమ‌ల‌పై ఎక్కువ‌గా రుద్ద‌కూడ‌దు. నెమ్మ‌దిగా చేత్తో రుద్దాలి. అలాగే కాట‌న్ వ‌స్త్రంతో నెమ్మ‌దిగా రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. అలాగే మొటిమ‌ల‌తో బాధ‌ప‌డే వారు ముఖానికి 5 నుండి 10నిమిషాల పాటు ఆవిరి ప‌ట్టుకోవాలి. ఇలా ఆవిరి ప‌ట్టుకోవ‌డం వల్ల చ‌ర్మ రంధ్రాల్లో ఉండే వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి. అలాగే మొటిమ‌ల‌తో బాధ‌ప‌డే వారు ముఖానికి తేనెను రాసుకోవాలి.

Pimples Home Remedies naturally get rid of them by these ways
Pimples Home Remedies

మంచి నాణ్య‌త క‌లిగిన తేనెను తీసుకుని మొటిమ‌ల‌పై నెమ్మ‌దిగా రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి. వారానికి రెండు సార్లు ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే మొటిమ‌ల‌తో బాధ‌ప‌డే వారు ముఖానికి మ‌డ్ ప్యాక్ వేసుకోవాలి. న‌ల్ల‌టి మెత్త‌టి మ‌ట్టిని తీసుకుని నీటిలో వేసి 5 నుండి 6 గంట‌ల పాటు నానబెట్టాలి. త‌రువాత ఈ మ‌ట్టిని తీసుకుని ముఖానికి రాసుకోవాలి. దీనిని ఆరిన త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌ల భాగానికి రక్త‌ప్ర‌స‌ర‌ణ ఎక్కువ‌గా జ‌రుగుతుంది. దీంతో ఈ భాగంలో వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి. చ‌ర్మ క‌ణాలు ఆరోగ్యంగా త‌యార‌వుతాయి.

మ‌చ్చ‌లు, మొటిమ‌లు త‌గ్గుతాయి. అలాగే వీటితో పాటు రోజూ 4 నుండి 5 లీట‌ర్ల నీటిని తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి. శ‌రీరంలో వ్య‌ర్థాలు ఎక్కువ‌గా పేరుకుపోవ‌డం వల్ల కూడా మొటిమ‌ల స‌మ‌స్య త‌లెత్తుతుంది. క‌నుక రోజూ 4 లీట‌ర్ల నీటిని తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు రాకుండా ఉంటాయి. అలాగే ఉద‌యం పూట వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి. సాయంత్రం విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే క‌మలా పండ్ల జ్యూస్, బ‌త్తాయి జ్యూస్ వంటి వాటిని తీసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మొటిమ‌లు త‌గ్గ‌డంతో పాటు లేని వారికి రాకుండా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts