Rose Water For Face Beauty: మార్కెట్‌లో మనకు రోజ్ వాటర్ విరివిగా లభిస్తుంది. దీన్ని సాధారణంగా చాలా మంది ఉపయోగించరు. కానీ రోజ్ వాటర్‌ను వాడితే చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. చర్మ సమస్యలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. రోజ్ వాటర్ వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* గంధం పొడి, పసుపు, రోజ్ వాటర్ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఎండలో తిరడం వల్ల నల్లగా మారిన చర్మం తిరిగి పూర్వ రూపాన్ని పొందుతుంది.
* అర టీస్పూన్ కీర దోస రసంలో కొద్దిగా రోజ్ వాటర్‌ను కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ల కింద రాసుకుని 30 నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కళ్లు ఆకర్షణీయంగా మారడమే కాదు, డార్క్ సర్కిల్స్ పోతాయి.
* ముల్తానీ మట్టిలో 1 టీస్సూన్ బంగాళాదుంప గుజ్జు, 4 చుక్కల రోజ్ వాటర్‌ను కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్‌లా వేయాలి. 15 నిమిషాలు ఆగాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో రెండో రోజు వరకు చర్మం తాజాగా మారుతుంది.
* రోజ్ వాటర్‌లో కొద్దిగా దూదిని ముంచి కళ్ల చుట్టూ అద్దుతూ మర్దనా చేసినట్లు రాయాలి. తరచూ ఇలా చేస్తుంటే డార్క్ సర్కిల్స్ పోయి, కళ్లు ఆకర్షణీయంగా మారుతాయి.
* టమాటాల గుజ్జు 1 టీస్పూన్, పెరుగు 1 టీస్పూన్, రోజ్ వాటర్ అర టీస్పూన్ మోతాదులో తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడపై రాయలి. 15 నిమిషాలు ఆగాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. అనంతరం చల్లని నీటితో మరోసారి కడగాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
* కీరదోస రసంలో కొద్దిగా రోజ్ వాటర్, గ్లిజరన్ చుక్కలు వేసి ముఖానికి రాసుకోవాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది.
* నిమ్మరసంలో రోజ్ వాటర్ కలిపి రాత్రివేళ పడుకునే ముందు ముఖానికి రాయాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి.
* 2 టీస్పూన్ల పసుపులో 1 టీస్పూన్ రోజ్ వాటర్‌ను కలిపి పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని ముఖంపై రాయాలి. తరువాత కొంత సేపు ఉంచి ఆరాక చల్లని నీటితో కడిగేయాలి. దీంతో ముఖం సౌందర్యాన్ని పొందుతుంది. కాంతివంతంగా మారుతుంది.